ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. 2013లో ఎంట్రీ ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్... 2016లో ఐపీఎల్ టైటిల్ గెలిచింది. ఐదు సార్లు ప్లేఆఫ్స్ చేరి, ఓ సారి రన్నరప్‌గానూ నిలిచింది. అయితే ఐపీఎల్ 2021 సీజన్ నుంచి ఆరెంజ్ ఆర్మీ ఆటతీరు దారుణంగా దిగజారింది. వరుస పరాజయాలతో అత్యంత బలహీనమైన జట్టుగా మారిపోయింది...
ఐపీఎల్ ఛాంపియన్ టీమ్ ముంబై ఇండియన్స్‌కి కూడా చుక్కలు చూపించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్‌సీబీ టైటిల్ ఆశలను నెరవేరకుండా చాలాసార్లు అడ్డుపడింది...
211
ఐపీఎల్ 2021 సీజన్‌ని టైటిల్ ఫెవరెట్‌గా మొదలెట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే ఆరు మ్యాచుల్లో ఐదింట్లో ఓడి, టోర్నీలోనే చెత్త రికార్డు మూటకట్టుకుంది. టీమ్ సెలక్షన్ విషయంలో అప్పటి కెప్టెన్ డేవిడ్ వార్నర్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు...
311
అప్పటి నుంచి ఆరెంజ్ ఆర్మీ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించిన సన్‌రైజర్స్, ఆ స్థానంలో కేన్ విలియంసన్‌కి బాధ్యతలు అప్పగించింది...
411
యూసఫ్ పఠాన్, శిఖర్ ధావన్ వంటి సీనియర్లు ఉన్న జట్టును ఐపీఎల్ 2018 సీజన్‌లో ఫైనల్ చేర్చిన కేన్ మామ... మ్యాచ్ విన్నర్లు లేని 2021 జట్టును విజయాల బాట పట్టించలేకపోయాడు...
511
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బలం బౌలింగ్. పవర్ ప్లేలో సందీప్ శర్మ, ఆ తర్వాత రషీద్ ఖాన్, డెత్ ఓవర్లలో భువనేశ్వర్ కుమార్.. ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించేవాళ్లు...
611
బ్యాటింగ్ భారాన్ని డేవిడ్ వార్నర్ ఒక్కడూ చూసుకునేవాడు. మనీశ్ పాండే, విజయ్ శంకర్ లాంటి ప్లేయర్లు రాణించకపోయినా కేన్ విలియంసన్, వార్నర్ కలిసి బ్యాటింగ్ భారాన్నంతా మోసి, జట్టుకి ఓ మోస్తరు స్కోరు అందించేవాళ్లు.
711
ఇప్పుడు టీమ్‌లో డేవిడ్ వార్నర్ లేడు. వార్నర్ లేని సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి పెద్దగా అభిమానుల సపోర్ట్ కూడా లేదు. టీమ్‌లో రషీద్ ఖాన్ లాంటి మ్యాచ్ విన్నర్లు లేరు...
811
ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్లేయర్లను కొనడానికంటే, టీ, బిస్కెట్లు తినడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారనే విషయం సగటు ఆరెంజ్ ఆర్మీ అభిమానికి బాగా తెలిసిన విషయమే...
911
ఐపీఎల్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన నికోలస్ పూరన్‌ని రూ.10 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది సన్‌రైజర్స్. వార్నర్ లేని లోటు పూరన్ తీరుస్తాడని భారీ ఆశలే పెట్టుకుంది...
1011
కార్తీక్ త్యాగి, ప్రియమ్ గార్గ్ వంటి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్లు టీమ్‌లో ఉన్నా, వారికి తుదిజట్టులో అవకాశం దక్కదు. కెప్టెన్‌కి టీమ్ సెలక్షన్‌పై నోరు విప్పే హక్కూ, అధికారం కూడా ఉండవు...
1111
అందుకే ఒక్కప్పుడు టాప్ టీమ్‌గా గుర్తింపు తెచ్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ఇప్పుడు స్వల్ప లక్ష్యాలను కూడా ఛేదించలేని వరస్ట్ టీమ్‌గా మారిపోయిందని ఆవేదన చెందుతున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్...