యాపిల్, డిస్నీ, అమెజాన్, సోనీ, నెట్‌ఫ్లెక్స్, ఫేస్‌బుక్... ఐపీఎల్ ప్రసారహక్కుల కోసం దిగ్గజ కంపెనీలు...

Published : Apr 05, 2022, 01:14 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో స్టార్ స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్‌ కాంట్రాక్ట్ పూర్తి కానుంది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం ఇప్పటికే బిడ్డింగ్‌ను ఆహ్వానించింది బీసీసీఐ. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల కోసం కార్పొరేట్ దిగ్గజ కంపెనీలు పోటీపడుతుండడం విశేషం...

PREV
17
యాపిల్, డిస్నీ, అమెజాన్, సోనీ, నెట్‌ఫ్లెక్స్, ఫేస్‌బుక్... ఐపీఎల్ ప్రసారహక్కుల కోసం దిగ్గజ కంపెనీలు...

ఐపీఎల్ 2023 నుంచి 27 వరకూ ఐదేళ్ల పాటు ప్రీమియర్ లీగ్ మ్యాచుల ప్రత్యక్ష ప్రసారం కోసం బిడ్డింగ్ ఆహ్వానిస్తోంది భారత క్రికెట్ బోర్డు...

27

ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండు కొత్త జట్ల (లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్) ద్వారా రూ.12 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని హుండీలో వేసుకున్న బీసీసీఐ, ప్రసార హక్కుల విక్రయం ద్వారా మరో రూ.35- 40 వేల కోట్ల వరకూ ఆర్జించాలని టార్గెట్‌గా పెట్టుకుంది...

37

ఇప్పటికే ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్‌ కోసం కార్పొరేట్ దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఐదేళ్లుగా ఐపీఎల్‌ను ప్రసారం చేస్తున్న స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, మరోసారి ప్రసార హక్కుల కోసం బిడ్ వేసింది...

47

డీస్నీ ప్లేస్ హాట్ స్టార్‌తో పాటు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లెక్స్ వంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ కూడా ఐపీఎల్ ప్రసారహక్కుల కోసం బిడ్ వేయడం విశేషం..

57

వీటితో పాటు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో పాటు ఆరంభంలో ప్రీమియర్ లీగ్ ‌ప్రసారం చేసిన సోనీ కంపెనీ కూడా ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం పోటీలో నిలిచింది...
 

67

వీటన్నింటితో పాటు యాపిల్, రిలయెన్స్ జీయో- వయాకామ్, జీ నెట్‌వర్క్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు కోసం ఐపీఎల్ ప్రసార హక్కులు పొందేందుకు పోటీలో నిలిచినట్టు వార్తలు వస్తున్నాయి...

77

ఈ వార్తలు నిజమైతే ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంఛైజీల అమ్మకం ద్వారా రూ.12 కోట్లు ఆర్జించిన బీసీసీఐకి బిడ్డింగ్‌ల ద్వారానే వందల కోట్లు వచ్చి చేరనుంది. ప్రసార హక్కుల ద్వారా వచ్చే డబ్బు అంతకు వంద రెట్టు ఉండనుంది.

click me!

Recommended Stories