ముంబై ఇండియన్స్ కంటే ముందే రోహిత్, ఆ టీమ్ కెప్టెన్ అయ్యేవాడు... ప్రజ్ఞాన్ ఓజా కామెంట్...

Published : Apr 05, 2022, 02:14 PM IST

ఐపీఎల్‌లో హ్యాట్రిక్ తీసి, సెంచరీ చేసిన ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ. డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌లో కెరీర్ మొదలెట్టిన రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్‌కి మారి, కెప్టెన్‌గా నియమించబడ్డాడు. కెప్టెన్‌గా ఆడిన మొదటి సీజన్‌లోనే టైటిల్ గెలిచిన రోహిత్ శర్మ, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ని మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా నిలిపాడు...

PREV
19
ముంబై ఇండియన్స్ కంటే ముందే రోహిత్, ఆ టీమ్ కెప్టెన్ అయ్యేవాడు... ప్రజ్ఞాన్ ఓజా కామెంట్...

ఐపీఎల్ 2009 సీజన్‌లో టైటిల్ గెలిచిన డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్న రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించాడు...

29

ఐపీఎల్ 2011 మెగా వేలంలో రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ జట్టు రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసింది. 2022 మెగా వేలానికి ముందు వరకూ వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా ఉండేవాడు రోహిత్ శర్మ...

39

‘రోహిత్ శర్మ బ్యాటర్‌గా అసాధారణమైన ప్లేయర్. ముంబై దేశవాళీ జట్టుకి కూడా రోహిత్ ఎప్పుడూ కెప్టెన్సీ చేసింది లేదు. అయితే రోహిత్ శర్మలోని కెప్టెన్‌ని ఆడమ్ గిల్‌క్రిస్ట్ గుర్తించాడు...

49

రోహిత్ శర్మను ఎప్పుడూ థింక్ ట్యాంక్ పొజిషన్‌లో పెట్టేవాడు గిల్‌క్రిస్ట్. రోహిత్ బ్యాటింగ్‌, ఒత్తిడిని ఫేస్ చేయడంతో అతని యాటిట్యూడ్‌ని గిల్లీ గమనించాడు... 

59

అందుకే రోహిత్‌లోని నాయకుడిని మరింత రాటుతేల్చేందుకు అతనికి కొన్ని క్లిష్టమైన పనులను కేటాయించేవాడు. వాటిని పూర్తి చేయడంలో రోహిత్ స్కిల్స్ గమనించేవాడు.

69
Rohit Sharma

వాటిని పూర్తి చేసే విషయంలో రోహిత్ ఇచ్చిన సూచనలు, సలహాలను బట్టి, అతనిలో కెప్టెన్‌ సిద్ధమయ్యాడని గిల్‌క్రిస్ట్ భావించాడు... జట్టును నడిపించడానికి రోహిత్ శర్మ రెఢీగా ఉన్నాడని కూడా చెప్పాడు.

79

ఐపీఎల్ 2011 సీజన్‌లో మెగా వేలం ఉండకపోయి ఉంటే, రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కంటే ముందే కచ్ఛితంగా డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌కి కెప్టెన్ అయ్యేవాడు...

89

వేలంలో ఏ ప్లేయర్ ఏ టీమ్‌లోకి వెళ్తాడనేది చెప్పలేం. సచిన్ టెండూల్కర్ తర్వాత రోహిత్ శర్మ మాత్రమే జట్టును నడిపించగలడని ముంబై ఇండియన్స్ టీమ్ భావించింది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా...

99

ప్రజ్ఞాన్ ఓజా, రోహిత్ శర్మతో కలిసి 2009లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆడమ్ గిల్‌క్రిస్ట్ కెప్టెన్సీలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున ఆడాడు... ఆ తర్వాత ముంబై ఇండియన్స్ తరుపున కలిసి ఆడాడు.

Read more Photos on
click me!

Recommended Stories