ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు సీఎస్‌కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. దీంతో ఎన్నో ఏళ్లుగా సీఎస్‌కే కెప్టెన్సీ కోసం వెయిట్ చూస్తున్న జడ్డూ ఆ పొజిషన్‌లో బాధ్యతలు తీసుకున్నాడు...
రవీంద్ర జడేజా కెప్టెన్సీలో వరుసగా నాలుగు పరాజయాలు చవిచూసిన చెన్నై సూపర్ కింగ్స్, ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది...
28
పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం కోసం పోటీపడుతున్నట్టుగా 4 సార్లు టైటిల్ గెలిచిన సీఎస్‌కే, ఫైవ్ టైమ్ టైటిల్ విన్నర్ ముంబై ఇండియన్స్... ఈ సీజన్‌లో నాలుగేసి మ్యాచులు ముగిసిన తర్వాత కూడా తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నారు.
38
కెప్టెన్సీ నుంచి తప్పించుకున్న ఎమ్మెస్ ధోనీ, తన స్టైల్‌లో కూల్‌గా కనిపిస్తుంటే, కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రవీంద్ర జడేజా కెప్టెన్సీ ప్రెషర్‌తో తన సహజ స్టైల్ ఆటతీరు కూడా చూపించలేకపోతున్నాడు...
48
‘రవీంద్ర జడేజా చాలా మంచి ఆల్‌రౌండర్. అలాంటి ప్లేయర్‌కి కెప్టెన్సీ ప్రెషర్ ఉండకూడదు. అప్పుడే జడ్డూ ఫ్రీగా తన ఆటపై ఫోకస్ పెట్టగలుగుతాడు...
58
ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ పునఃసమీక్షించుకుంటే, ఈ పరిస్థితి వస్తుందని అనుకుని ఉంటే ఫాఫ్ డుప్లిసిస్‌ని వేరే జట్టుకి వెళ్లనిచ్చేవాళ్లు కాదేమో...
68
ఫాఫ్ డుప్లిసిస్ మ్యాచ్ విన్నర్. చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఐపీఎల్ టైటిల్ కూడా గెలిచాడు. అపారమైన అంతర్జాతీయ అనుభవం కూడా ఉంది...
78
ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ముందుగానే టీమ్ మేనేజ్‌మెంట్‌కి చెప్పి ఉంటే, ఆ బాధ్యతను ఫాఫ్ డుప్లిసిస్‌కి అప్పగించాల్సింది...
88
జడేజా కేవలం ప్లేయర్‌గా కొనసాగి ఉంటే, అతని పూర్తి టాలెంట్ బయటికి రావడానికి స్వేచ్ఛ దొరికేది. ఇప్పుడు చెన్నై కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్టైంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి...