మామా... నీ ఐరన్ లెగ్ వల్లే ఇదంతా! కెఎల్ రాహుల్ డకౌట్ తర్వాత సునీల్ శెట్టిపై ట్రోల్స్...

Published : Apr 11, 2022, 03:30 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ను గోల్డెన్ డకౌట్‌తో ప్రారంభించాడు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్. ఐపీఎల్ 2022లో అత్యధిక మొత్తం అందుకుంటున్న ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన కెఎల్ రాహుల్, మొదటి మ్యాచ్ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు...  

PREV
19
మామా... నీ ఐరన్ లెగ్ వల్లే ఇదంతా! కెఎల్ రాహుల్ డకౌట్ తర్వాత సునీల్ శెట్టిపై ట్రోల్స్...

కెప్టెన్‌గా తనపై విమర్శలకు విజయాలతోనే సమాధానం చెప్పాలనుకున్నాడు కెఎల్ రాహుల్. హ్యాట్రిక్ విజయాల తర్వాత  రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో పోరాడి ఓడింది లక్నో...

29

మార్కస్ స్టోయినిస్ లాంటి హిట్టర్‌ని 8వ స్థానంలో బ్యాటింగ్‌కి పంపి, కృష్ణప్ప గౌతమ్‌ని వన్‌డౌన్‌లో పంపడం... మొదటి బంతికే కెఎల్ రాహుల్ గోల్డెన్ డకౌట్ కావడం... లక్నో విజయంపై ప్రభావం చూపింది...

39

వరుసగా మూడు విజయాలు అందుకుని జోరు మీదున్న కెఎల్ రాహుల్ టీమ్ ఆటను కళ్లారా చూడాలని కుటుంబంతో సహా స్టేడియానికి వచ్చింది అతని గర్ల్ ఫ్రెండ్ అథియా శెట్టి... 

49

అథియా శెట్టి నాన్న సునీల్ శెట్టి కూడా స్టేడియంలో కనిపించాడు. దీంతో కెఎల్ రాహుల్‌ కెప్టెన్సీపైన వచ్చిన ట్రోల్ కాస్తా సునీల్ శెట్టి వైపు టర్న్ అయ్యాయి...

59

ఈ మధ్యకాలంలో సునీల్ శెట్టి నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్‌లుగా మిగిలాయి. రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘దర్భార్’ సినిమాలో విలన్‌గా నటించాడు సునీల్ శెట్టి...

69

రజినీ సినిమాలకు ఉండే హడావుడి కూడా లేకుండా విడుదలైన ‘దర్భార్’, బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత మంచు విష్ణు, కాజల్ అగర్వాల్‌ల ‘మోసగాళ్లు’ సినిమాలో నటించాడు సునీల్ శెట్టి.

79

రూ.50 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించినట్టు ప్రకటించిన ‘మోసగాళ్లు’, నిర్మాతలను నిలువునా ముంచేసింది. ఆ తర్వాత మలయాళంలో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా ‘మరక్కర్’లోనూ నటించాడు సునీల్ శెట్టి.

89

ఈ సినిమా రిజల్ట్ కూడా దాదాపు సేమ్. తాజాగా వరుణ్ తేజ్ ‘గనీ’ సినిమాలో విలన్‌గా నటించాడు సునీల్ శెట్టి. దాదాపు రూ.30 కోట్లతో రూపొందిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ దిశగా పరుగులు పెడుతోంది...

99

దీంతో సునీల్ శెట్టి కనిపిస్తే చాలు, అక్కడ రిజల్ట్ తేడా కొట్టేస్తుందని... వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న కెఎల్ రాహుల్‌ను మామ గారి ఐరన్ లెగ్, గోల్డెన్ డకౌట్‌ చేసిందని అంటూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.. 

click me!

Recommended Stories