ఆ ఐదో టెస్టు ఎంత పని చేసిందయ్యా... ఇటు విరాట్ కోహ్లీ, అటు జో రూట్ తప్పుకోవడంతో...

Published : Apr 15, 2022, 03:13 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ ఫస్ట్ ఫేజ్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లింది భారత జట్టు. అక్కడ న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన తర్వాత ఇంగ్లాండ్ జట్టుతో టెస్టు సిరీస్ ఆడింది. అయితే ఈ సిరీస్‌లో ఓ టెస్టు ఇంకా మిగిలే ఉంది...

PREV
111
ఆ ఐదో టెస్టు ఎంత పని చేసిందయ్యా... ఇటు విరాట్ కోహ్లీ, అటు జో రూట్ తప్పుకోవడంతో...

ఐదు టెస్టుల సిరీస్‌లో నాలుగు టెస్టులు ఆడిన తర్వాత భారత బ‌ృందంలో కరోనా కేసులు వెలుగుచూశాయి. అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియో కరోనా పాజిటివ్‌గా తేలారు...

211

దీంతో మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన ఐదో టెస్టు ఆరంభానికి ముందు హై డ్రామా నడిచింది. కొందరు భారత ప్లేయర్లు మ్యాచ్ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో అర్ధాంతరంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఇరుజట్లు. 

311

ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ ఆరంభానికి ముందు ఇంగ్లాండ్ నుంచి యూఏఈ చేరుకున్నారు భారత క్రికెటర్లు. భారత ప్లేయర్లు మ్యాచ్ ఆడడానికి ఇష్టపడకపోవడంతో దాన్ని ‘ఫోర్‌ఫీట్‌‌‌’గా పరిగణించి, ఆ మ్యాచ్‌ను ఇంగ్లాండ్ ఖాతాలో వేయాలని ఐసీసీని కోరింది ఆ జట్టు...

411

అయితే కరోనా కారణంగా రద్దయిన మ్యాచ్‌లను ‘ఫోర్‌ఫీట్‌’ పరిగణించలేమని ఐసీసీ ఖరారు చేసింది. 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న భారత జట్టుకి టెస్టు సిరీస్ ఇచ్చేందుకు ఇంగ్లాండ్ అంగీకరించలేదు.

511

దీంతో 2022 జూలైలో ఇంగ్లాండ్ పర్యటనలో మూడే వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడాల్సి ఉంది భారత జట్టు. ఇదే పర్యటనలో ఐదో టెస్టు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి ఇరు జట్లు. 

611

INDvsENG 4th testమూడో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో దక్కిన ఓటమికి టీమిండియా త్వరగానే ప్రతీకారం తీర్చుకుంది. బ్యాటింగ్ పిచ్‌పై ఇంగ్లాండ్ జట్టును ఆలౌట్ చేసి, పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. 

711

ఇప్పటికే జూలై 1 నుంచి బెర్మింగ్‌హమ్‌లోని ఎడ్‌బస్టన్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఐదో టెస్టు మ్యాచ్ నిర్వహించాలని షెడ్యూల్ కూడా ఖరారు చేశాయి బీసీసీఐ, ఈసీబీ...

811

అయితే ఈ ఐదో టెస్టుకి ముందు రెండు జట్లలోనూ సంచలన మార్పులు జరిగాయి. బీసీసీఐతో విభేదాల కారణంగా సౌతాఫ్రికా పర్యటనలో కేప్‌టౌన్ టెస్టు ఓటమి తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ...

911

అలాగే వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ తాజాగా నిర్ణయం తీసుకున్నాడు జో రూట్...

1011

అటు విరాట్ కోహ్లీ, ఇటు జో రూట్ ఇద్దరూ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఐదో టెస్టు కొత్త కెప్టెన్ల కెప్టెన్సీలో జరగనుంది...

1111

జూలై వరకూ గాయపడకుండా ఫిట్‌గా ఉంటే టీమిండియాకి రోహిత్ శర్మ, ఇంగ్లాండ్ టెస్టు టీమ్‌కి బెన్ స్టోక్స్ కెప్టెన్లుగా మొదటి నాలుగు టెస్టులకు కెప్టెన్సీ చేసిన విరాట్ కోహ్లీ, జో రూట్ సాధారణ ప్లేయర్లుగా... టెస్టు సిరీస్‌లో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడబోతున్నారు..

Read more Photos on
click me!

Recommended Stories