నా ఇన్‌స్పిరేషన్ ఉమ్రాన్ మాలిక్! బాబర్ ఆజమ్ బెస్ట్ బ్యాటర్... డేల్ స్టెయిన్ కామెంట్స్..

Published : Apr 14, 2022, 08:32 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలింగ్ లెజెండ్ డేల్ స్టెయిన్‌ని ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్‌లో స్టెయిన్ ఇంపాక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది కూడా...

PREV
110
నా ఇన్‌స్పిరేషన్ ఉమ్రాన్ మాలిక్! బాబర్ ఆజమ్ బెస్ట్ బ్యాటర్... డేల్ స్టెయిన్ కామెంట్స్..

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డేల్ స్టెయిన్, తాజాగా సోషల్ మీడియాలో తన ఫాలోవర్ల ప్రశ్నాలకు కొంచెం ఫన్నీగా ఆన్సర్లు ఇచ్చాడు...

210

మీ అభిప్రాయంలో ఇప్పుడున్న తరంలో బెస్ట్ బ్యాట్స్‌మెన్‌ ఎవరు? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా దానికి డేల్ స్టెయిన్, ‘బాబర్ కావచ్చు... అతను అద్భుతంగా ఆడుతున్నాడు’ అంటూ సమాధానం ఇచ్చాడు.

310
Image Credit: Getty Images

విరాట్ కోహ్లీ, కేన్ విలియంసన్, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు ఉండగా బాబర్ ఆజమ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని చెప్పడంతో అభిమానులు కూసింత షాక్‌కి గురయ్యారు...

410

అయితే ఆ తర్వాత ‘మీ ఇన్‌స్పిరేషన్ ఎవరు’ అంటూ ప్రశ్నించాడు మరో నెటిజన్. దానికి డేల్ స్టెయిన్... ‘ఉమ్రాన్ మాలిక్’ అంటూ ఆన్సర్ ఇచ్చాడు...

510

2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఎంట్రీ ఇచ్చిన 150+ కి.మీ.ల వేగంతో బంతులు విసిరి, క్రికెట్ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించాడు ఉమ్రాన్ మాలిక్...

610

ఇంకా టీమిండియా తరుపున ఎంట్రీ కూడా ఇవ్వని ఉమ్రాన్ మాలిక్‌ని ఇన్‌స్పిరేషన్ అని చెప్పడంతో డేల్ స్టెయిన్ కాస్త ఫన్నీగా, వెటకారంగా సమాధానాలు ఇస్తున్నాడని పసిగట్టారు నెటిజన్లు...

710

‘ఉమ్రాన్ మాలిక్‌కి మీరిచ్చే సలహాలు ఏంటి? ఎలా బౌలింగ్ చేయమని చెబుతారు’ అని ఇంకో నెటిజన్ ప్రశ్నించాడు. దానికి ‘పేస్ మిస్ చేయకుండా బౌలింగ్ చేయమని చెబుతా. అందరూ 130- 135 కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేస్తారు. 

810

కానీ తన బౌలింగ్‌లో కాస్త వెరైటీ రావడానికి ఇంకొంచెం సమయం పడుతుంది...’ అంటూ ఆన్సర్ ఇచ్చాడు డేల్ స్టెయిన్.

910

పాకిస్తాన్‌కి రావడానికి ఇష్టపడతారా? అంటూ ఓ నెటిజన్ అడగగా... ‘అవును, ఆజం ఖాన్‌తో ఫిషింగ్ డేట్ కూడా ఉంది...’ అంటూ రిప్లై ఇచ్చాడు డేల్ స్టెయిన్...

1010

విశాఖపట్నం మంచి సర్డ్ఫ్ ప్లేస్ అని చెప్పిన డేల్ స్టెయిన్, భారత్‌లోని మైదానాలన్నీ చాలా బాగుంటాయని చెప్పుకొచ్చాడు.

click me!

Recommended Stories