ప్రైవేట్ జెట్‌లో తమన్నాతో విరాట్ కోహ్లీ... ఫోటో చూసి షాకైన అభిమానులు...

First Published Apr 14, 2021, 4:20 PM IST

భారత సారథి విరాట్ కోహ్లీ... ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు. మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే మ్యాచ్ కోసం సన్నద్దమవుతోంది. అయితే ఈలోగా హీరోయిన్ తమన్నా భాటియా పోస్టు చేసిన ఓ ఫోటోలో విరాట్ కోహ్లీ ప్రత్యేక్షం కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది...

ప్రస్తుతం కరోనా ప్రోటోకాల్ ప్రకారం బయో బబుల్‌లో గడుపుతున్న క్రికెటర్లు, బయటి వ్యక్తులను కలిసేందుకు కానీ, బయటికి వెళ్లేందుకు గానీ అవకాశం లేదు. అలా ఎవరైనా చేస్తే, వారిని ఐపీఎల్ నుంచి బహిష్కరిస్తారు కూడా...
undefined
అయితే తాజాగా హీరోయిన్ తమన్నా భాటియా, తన ప్రైవేట్ జెట్‌లోపల దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది... అందులో ‘బ్రేక్ ఫాస్ట్ ప్లీజ్’ అంటూ చేతి నిండా స్నాక్స్‌తో ఫోటోకి ఫోజిచ్చింది తమన్నా...
undefined
అయితే తమన్నా వెనకాల ఆశ్చర్యంగా విస్తుపోయి చూస్తున్న వ్యక్తి, అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను చూడడానికి అచ్చు విరాట్ కోహ్లీలా ఉండడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు...
undefined
బయో బబుల్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, తమన్నా ప్రైవేట్ జెట్‌లో ఏం చేస్తున్నాడని కొందరు ప్రశ్నించగా... మరికొందరు ఈ ఫోటో పాతది అయిఉండొచ్చని అంచనా వేశారు...
undefined
విరాట్ కోహ్లీలా కనిపించిన ఆ వ్యక్తి కారణంగా... తమన్నా పోస్టు చేసిన ఈ ఫోటోకి 6 లక్షలకు పైగా లైక్స్, కామెంట్లు రావడం విశేషం... అయితే ఫ్యాన్స్ అనుమానించినట్టు అతను విరాట్ కోహ్లీ కాదు...
undefined
తమన్నా భాటియా మేకప్ ఆర్టిస్ట్ ఫోర్లియన్ హారెల్... అతను చూడడానికి విరాట్ కోహ్లీలా కూడా ఏమీ ఉండడు. అయితే ఆ సమయంలో అతను ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్, విరాట్ కోహ్లీలా అనిపించి, అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది...
undefined
‘ఎలెవెన్త్ హావర్’ అనే వెబ్ సిరీస్ చేసిన తమన్నా భాటియా... దాని ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మేకప్ ఆర్టిస్ ఫోరియన్ హారెల్, ఫ్రెండ్ నీలమ్‌తో కలిసి హైదరాబాద్‌లో పర్యటించింది... ఆ ఫోటోలే ఇవి...
undefined
విరాట్ కోహ్లీ, తమన్నా కలిసి కొన్ని యాడ్స్‌లో కలిసి నటించారు. ‘మొబైల్ ప్రీమియర్ లీగ్’ ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లో వీరిద్దరూ భాగస్వాములు కూడా...
undefined
అనుష్క శర్మ కంటే ముందు విరాట్ కోహ్లీ, కొన్నాళ్ల పాటు తమన్నా భాటియాతో కూడా డేటింగ్ చేస్తున్నాడని ప్రచారం జరిగింది...
undefined
కొన్నాళ్ల క్రితం ‘ఎలెవెన్త్ హావర్’ వెబ్ సిరీస్‌ను విడుదల చేసిన తమన్నా భాటియా... ప్రస్తుతం నితిన్ హీరోగా రూపొందుతున్న ‘మాస్ట్రో’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది...
undefined
click me!