ఐసీసీ అవార్డుల్లో హ్యాట్రిక్ కొట్టిన టీమిండియా... వరుసగా మూడో నెలలో కూడా...

Published : Apr 14, 2021, 03:21 PM IST

ఐసీసీ మంత్లీ అవార్డుల్లో టీమిండియా హ్యాట్రిక్ కొట్టింది. జనవరి నెల నుంచి ప్రతీ నెలా ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లకు ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ పేరుతో అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ క్రికెట్ మండలి. అయితే ఇప్పటిదాకా గడిచిన మూడు నెలల్లోనూ పురుషుల విభాగంలో భారత క్రికెటర్లకే అవార్డులు దక్కడం విశేషం.

PREV
17
ఐసీసీ అవార్డుల్లో హ్యాట్రిక్ కొట్టిన టీమిండియా... వరుసగా మూడో నెలలో కూడా...

తాజాగా మార్చి నెల ప్రదర్శనకు భువనేశ్వర్ కుమార్, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కించుకున్నాడు. అతనితో పోటీపడిన విండీస్ ప్లేయర్ సీన్ విలియమ్స్, ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్‌ఖాన్‌లకి నిరాశే ఎదురైంది...

27

మార్చి నెలలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన భువనేశ్వర్ కుమార్... వన్డేల్లో ఆరు, టీ20ల్లో 4 వికెట్లు పడగొట్టాడు...

37

జనవరి నెలలో ఆరంభించిన ఐసీసీ మంత్లీ అవార్డుల్లో మొదటి అవార్డు ‘గబ్బా’ టెస్టు హీరో రిషబ్ పంత్‌కి దక్కింది... ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అదరగొట్టాడు రిషబ్ పంత్...

47

ఫిబ్రవరి నెలకు గాను ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు...

57

మరోవైపు మహిళల విభాగంలో మాత్రం భారత మహిళలకు నిరాశే ఎదురైంది. మార్చి నెలలో ప్రదర్శనకు గానూ ఇద్దరు భారత మహిళా క్రికెటర్లు నామినేషన్లలో నిలిచినా వారికి అవార్డు దక్కలేదు...

67

టీమిండియాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో అదరగొట్టిన ఇంగ్లాండ్ ప్లేయర్ లిజెల్లీ లీ, ఐసీసీ వుమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైంది...

77

లీజెల్లీ లీ వన్డే సిరీస్‌లో 288 పరుగులు, టీ20 సిరీస్‌లో 90 పరుగులు చేసింది. రేసులో నిలిచిన రాజేశ్వరి గైక్వాడ్ వన్డేల్లో 8, టీ20ల్లో నాలుగు వికెట్లు తీయగా, పూనమ్ రౌత్ వన్డే సిరీస్‌లో 263 పరుగులు చేసింది. 

click me!

Recommended Stories