టాలెంట్ ఉన్నవాళ్లకి ప్లేస్ దక్కడం లేదు, కెప్టెన్సీ కోసం వాళ్లను... పాక్ ప్లేయర్ షోయబ్ మాలిక్ సంచలన ఆరోపణలు..

First Published May 18, 2021, 3:39 PM IST

పాక్ క్రికెట్ బోర్డులో లుకలుకలు కొత్తేమీ కాదు. డానిష్ కనేరియా ఆరోపణలు, మహ్మద్ అమీర్ రిటైర్మెంట్, యూఎస్ లీగ్‌లో ఆడేందుకు ఆటగాళ్ల ప్రయత్నాలు.. ఇలా కొన్నాళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టును వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా పీసీబీ తీరుపై విమర్శల వర్షం కురిపించాడు సీనియర్ ప్లేయర్ షోయబ్ మాలిక్...

116 టీ20 మ్యాచులు ఆడి, అత్యధిక టీ20 మ్యాచులు ఆడిన ప్లేయర్‌గా, టీ20ల్లో 10 వేల పరుగులు చేసిన మొట్టమొదటి పాక్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన షోయబ్ మాలిక్, ఇప్పటికే వన్డే, టెస్టుల నుంచి తప్పుకున్నాడు.
undefined
‘ఒక టూర్‌కి టీమ్‌ను సెలక్ట్ చేసేటప్పుడు ఆటగాడి ప్రతిభ, ప్రదర్శన రెండూ దృష్టిలో తీసుకోవాలి. కానీ పాక్ జట్టులో మాత్రం అలా జరగడం లేదు. బోర్డుకి, అధికారులకు నచ్చిన ప్లేయర్లకు జట్టులో చోటు దక్కుతోంది. నచ్చకపోతే, ఎంత టాలెంట్ ఉన్న ప్లేయర్ అయినా పక్కనబెట్టేస్తున్నారు.
undefined
ఇది అంతటా ఉండేదే, కానీ ఇక్కడ మరీ ఎక్కువగా ఉంది. తెలిసినవాడికి, దగ్గరికి వాడికి కాకుండా టాలెంట్ ఉన్నోడికి జట్టులో ప్లేస్ ఇస్తే, పాక్ జట్టు నిజంగా బాగుపడుతుంది...
undefined
అంతర్జాతీయ జట్టు అంటే అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపించాలి. జట్టు ఎంపికలో పూర్తిగా పారదర్శకత చూపిస్తేనే ఇది సాధ్యమవుతుంది. కానీ పీసీబీలో అలా జరగడం లేదు...
undefined
జింబాబ్వే టూర్‌కి వెళ్లిన పాక్ జట్టులో చాలామంది ప్లేయర్లు, కెప్టెన్ బాబర్ ఆజమ్ ఎంచుకున్నవాళ్లు కాదు. అతను కావాలనుకున్న ప్లేయర్లను పక్కనబెట్టి, బోర్డుకి నచ్చిన ప్లేయర్లను వెంట ఇచ్చి పంపించింది... ఓ ప్లేయర్‌ని ఎంపిక చేసే విషయంలో కెప్టెన్‌కి కూడా అధికారం ఉంటుంది...
undefined
జట్టుతో కలిసి క్రీజులో తలబడేది, అపజయం ఎదురైతే బాధ్యత వహిస్తూ నిలబడేది కెప్టెనే. కానీ మనదగ్గర కెప్టెన్‌కి నచ్చిన టీమ్‌కూడా దొరకడం లేదు.
undefined
అలాగని కెప్టెన్ ఏమైనా సరిగా ఉన్నాడా అంటే అదీ లేదు... అతను కెప్టెన్సీ కోసం అధికారులను, బోర్డు పెద్దలతో వినయం నడుస్తూ మెలుగుతున్నట్టు కనిపిస్తోంది.
undefined
ఇలా మాట్లాడడం వల్ల, పీసీబీలో జరుగుతున్న అవకతవకలను బయటపెట్టడం వల్ల నాకు ఎలాంటి నష్టం జరుగుతుందో నేను ఊహించగలను. నన్ను ఇకపై టీమ్‌లోకి తీసుకోకపోయినా నేనేమీ బాధపడను.
undefined
ఎందుకంటే ఇప్పటికే నేను చాలా క్రికెట్ ఆడాను. వకార్ యూనిస్, వసీం అక్రమ్, ఇంజమామ్ వుల్ హక్, షాహిద్ ఆఫ్రిదీ కెప్టెన్సీలో ఆడాను. గొప్ప కెప్టెన్‌గా నిలవాలంటే వ్యక్తి ప్రయోజనాల కంటే జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలి...’ అంటూకామెంట్ చేశాడు షోయబ్ మాలిక్.
undefined
వాస్తవానికి షాహిదీ అఫ్రిదీ రిటైర్మెంట్ తర్వాత సీనియర్ బ్యాట్స్‌మెన్ అయిన షోయబ్ మాలిక్‌కి కెప్టెన్సీ దక్కుతుందని భావించారు. అయితే మాలిక్‌కి కెప్టెన్సీ దక్కకుండా బోర్డులో రాజకీయం జరిగిందని అఫ్రిదీయే సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం.
undefined
click me!