2007 టీ20 వరల్డ్‌కప్‌లో మాథ్యూ హేడెన్‌ను సెడ్జింగ్ చేశా, ఆ మాట అన్నందుకు మూడేళ్ల పాటు... - రాబిన్ ఊతప్ప

First Published May 18, 2021, 3:12 PM IST

2007 వన్డే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాజయంతో గ్రూప్ స్టేజ్‌లోనే వెనుదిరిగిన తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టీ20 వరల్డ్‌కప్‌కి వెళ్లింది టీమిండియా. అండర్‌డాగ్స్‌గా ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగి, టైటిల్ గెలిచి చరిత్ర క్రియేట్ చేసింది. 

2007 టీ20 వరల్డ్‌కప్ సెమీస్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో జరిగన సంఘటనలను గుర్తుచేసుకున్నాడు టీమిండియా బ్యాట్స్‌మెన్ రాబిన్ ఊతప్ప. ఆ మ్యాచ్‌లో జరిగిన సంఘటన కారణంగా హేడెన్ తనతో మూడేళ్లు మాట్లాడలేదని చెప్పుకొచ్చాడు...
undefined
‘2007 టీ20 వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్‌లో ఆసీస్ ప్లేయర్ల నోటికి హద్దూ, అదుపూ లేకుండా పోయింది. నాతో పాటు ప్రతీ ప్లేయర్‌ను, బ్యాట్స్‌మెన్‌ను టార్గెట్ చేస్తూ సెడ్జింగ్‌కి పాల్పడ్డింది రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆసీస్ టీమ్...
undefined

Latest Videos


ఆస్ట్రేలియా టీమ్ సెడ్జింగ్ చేస్తుంటే, భారత జట్టులో చాలామంది ప్లేయర్లు వారిని పట్టించుకోకుండా ఆడారు. కానీ జాక్ భాయ్ (జహీర్ ఖాన్), ఇర్ఫాన్ పఠాన్ మాత్రం వారి మాటలంటే ఊరుకోకుండా తిరిగి మాటలనడంమొదలెట్టారు...
undefined
ఫాస్ట్ బౌలర్లు ఎదురుదాడికి దిగినట్టుగా బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ కూడా ఆసీస్ టీమ్‌కి గట్టి సమాధానం ఇవ్వలేదు. గౌతీ (గౌతమ్ గంభీర్)కి ఆవేశం ఎక్కువ. అతను సైమండ్స్‌కి గట్టి కౌంటర్ ఇచ్చాడు. వారితో పాటు మిచెల్ జాన్సన్, బ్రాడ్ హడ్డిన్‌లను కూడా వదిలిపెట్టలేదు...
undefined
కానీ నేను మాథ్యూ హేడెన్‌ను సెడ్జింగ్ చేయడం ఇప్పటికీ గుర్తుంది. ఓ ప్లేయర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా మాథ్యూ హేడెన్ నన్ను ఎంతగానో ఇన్‌స్ఫైర్ చేశారు. ఆయన బ్యాటింగ్ చూసి నేను చాలా నేర్చుకున్నా...
undefined
ఆ రోజు మ్యాచ్‌లో నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు హేడెన్ ఏదో అన్నాడు. నేను దాన్ని అతనికి తిరిగి ఇవ్వాలని అనుకున్నా. కానీ నేను ఆ మాట అనలేకపోయా. వేరే ఏదో అన్నాను...
undefined
అయితే ఆ సంఘటన తర్వాత మాథ్యూ హేడెన్ చాలా ఫీలయ్యాడు. రెండు, మూడేళ్లు నాతో మాట్లాడనేలేదు. నాకు దూరంగా ఉండేవాడు. ఆ రోజు విజయం కోసం అలా చేశాను. కానీ హేడెన్ మాట్లాడకపోవడం చాలా బాధపడ్డాను.
undefined
ఆ రోజు మ్యాచ్ మేం గెలిచినా, నేను నన్ను ఎంతగానో ఇన్‌స్పైర్ చేసిన వ్యక్తితో మూడేళ్లు విలువైన మాటలను కోల్పోయాను... ’ అంటూ చెప్పుకొచ్చాడు రాబిన్ ఊతప్ప.
undefined
‘ఆ తర్వాత ఏడాది ఆస్ట్రేలియా జట్టు ఏడు వన్డేలు, ఓ టీ20 సిరీస్ ఆడేందుకు ఇక్కడికి వచ్చింది. అప్పుడు కూడా ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. మొదటి వన్డేలు ధోనీ, సీనియర్లు కలిసి నన్ను సిల్లీ పాయింట్‌లో నిలబెట్టారు.
undefined
రికీ పాంటింగ్‌ను ఇబ్బంది పెడుతూ, అతని ఏకాగ్రతను దెబ్బతీయడానికి చేసిన ఎత్తుగడ అది. ఆ టైమ్‌ చాలా బాగుండేది’ అంటూ వివరించాడు రాబిన్ ఊతప్ప...
undefined
click me!