కరోనా పాజిటివ్ వచ్చినా ఫైనల్ ఆడనిచ్చిన ఆసీస్... గోల్డ్ మెడల్ కోసం ఆస్ట్రేలియా షాకింగ్ పని...

First Published Aug 8, 2022, 1:20 PM IST

కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఆస్ట్రేలియా మహిళా జట్టు, టీమిండియాని 9 పరుగుల తేడాతో ఓడించి స్వర్ణం గెలిచింది. 2020 టీ20 వరల్డ్ కప్, 2022 వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా మహిళా జట్టు, కామన్వెల్త్ గేమ్స్‌లోనూ స్వర్ణం సాధించి చరిత్ర క్రియేట్ చేసింది. అయితే ఫైనల్‌లో గెలిచేందుకు ఆసీస్‌ అనుసరించిన విధానంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి...

భారత్‌తో ఫైనల్ మ్యాచ్‌కి ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆల్‌రౌండర్ తహిలా మెక్‌గ్రాత్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది. నిబంధనల ప్రకారం పాజిటివ్ వచ్చిన ప్లేయర్‌ని ఐసోలేషన్‌కి తరలించాల్సి ఉంటుంది... మిగిలిన ప్లేయర్లకు దూరంగా ఉంచాల్సి ఉంటుంది.
 

Pooja Vastrakar

ఈ నిబంధన కారణంగా బర్మింగ్‌హమ్‌కి బయలుదేరే ముందు కరోనా పాజిటివ్‌గా తేలడంతో సబ్బినేని మేఘన, పూజా వస్త్రాకర్ లేకుండానే భారత జట్టు ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కింది. మొదటి మ్యాచ్‌లోనూ ఈ ఇద్దరూ ఆడలేదు...

అయితే ఆస్ట్రేలియా మాత్రం ఫైనల్ మ్యాచ్‌లో తహిలా మెక్‌గ్రాత్‌ని పక్కనబెట్టే సాహసం చేయడానికి ఇష్టపడలేదు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 51 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 78 పరుగులు చేసి భారీ స్కోరు అందించింది తహిలా మెక్‌గ్రాత్... బౌలింగ్‌లోనూ 3 వికెట్లు పడగొట్టింది...

Australia Women Team

న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో బౌలింగ్‌లో 2 రెండు వికెట్లు తీసిన తహిలా మెక్‌గ్రాత్, 23 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు చేసింది. బర్బొడాస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 3 వికెట్లు తీసి అదరగొట్టింది...

Tahlia Mcgrath

దీంతో కీ ప్లేయర్‌ని పక్కనబెట్టడం ఇష్టం లేని ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్, కరోనా పాజిటివ్ వచ్చినా ఆమెను ఫైనల్ మ్యాచ్ ఆడనిచ్చింది. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ విషయం బయటికి వచ్చింది. కరోనా పాజిటివ్ తేలినా బరిలో దిగిన మెక్‌గ్రాత్, బ్యాటింగ్‌లో 2 పరుగులు చేసి, బౌలింగ్‌లో 2 ఓవర్లు వేసి 24 పరుగులిచ్చింది. ఆమెతో కలిసి ఆడిన ఆస్ట్రేలియా ప్లేయర్లు అందరూ క్వారంటైన్‌లో గడిపి, కరోనా నెగిటివ్‌గా తేలిన తర్వాతే స్వదేశానికి బయలుదేరి వెళ్లనున్నారు...

ఆస్ట్రేలియా కరోనా నిబంధనల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో భారత జట్టును కరోనా నియమాల విషయంలో ముప్పుతిప్పలు పెట్టిన ఆస్ట్రేలియా, కరోనా వ్యాక్సిన్ చేయించుకోని కారణంగా ఆస్ట్రేలియా ఓపెన్ కోసం ఆసీస్ గడ్డ మీద అడుగుపెట్టిన స్టార్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్‌ని ఘోరంగా అవమానించి, కేసులు కూడా పెట్టింది...

Alyssa Healy

అలాంటి ఆస్ట్రేలియా, కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ గెలిచేందుకు వ్యవహరించిన తీరు క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. పతకం కోసం మిగిలిన ప్లేయర్ల ప్రాణాలతో ఆడుకునే అధికారం, ఆస్ట్రేలియాకి ఎవరిచ్చారని నిలదీస్తున్నారు.. 

click me!