టీమిండియా కెప్టెన్లకు రేటింగ్ ఇచ్చిన సురేష్ రైనా... ఆ ఇద్దరి తర్వాతే విరాట్ కోహ్లీ...

First Published Sep 16, 2021, 3:57 PM IST

టీమిండియాలోకి ఓ సంచలనంలా దూసుకొచ్చి, లెజెండ్స్‌గా మారతాడని క్రికెట్ విశ్లేషకుల చేత మెప్పు పొంది... కొద్దికాలానికి ఐపీఎల్‌కి మాత్రమే పరిమితమయ్యాడు సురేష్ రైనా. తాజాగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్లకు రేటింగ్ ఇచ్చాడు సురేష్ రైనా...

కెరీర్ ఆరంభంలో రైనా చూపించిన పర్ఫామెన్స్, తన కెరీర్ ఆసాంతం సాగి ఉంటే... ఇప్పటికి కోహ్లీ, రోహిత్‌లతో సమానంగా స్టార్ స్టేటస్ దక్కించుకునేవాడే... అయితే అలా జరగలేదు..

భారత జట్టుకి పెద్దగా రాణించకపోయినా, ఐపీఎల్‌లో సీఎస్‌కే తరుపున మెరుపులు మెరిపిస్తూ... ‘మిస్టర్ ఐపీఎల్’గా గుర్తింపు తెచ్చుకున్న సురేష్ రైనా... గత ఏడాది ఎమ్మెస్ ధోనీతో పాటే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు...

‘నేను బ్యాట్స్‌మెన్‌గా, ప్లేయర్‌గా మాహీ భాయ్ కెప్టెన్సీలో ఎక్కువకాలం ఆడాను. లీడర్‌గా ఎమ్మెస్ ధోనీని దగ్గర్నుంచి చూశాను కూడా...

నా కెరీర్ ఆరంభంలో రాహుల్ భాయ్ (రాహుల్ ద్రావిడ్) కారణంగానే నేను జట్టులోకి వచ్చాను. ద్రావిడ్‌ వచ్చిన క్రెడిట్ తక్కువైనా, ఆయన భారత జట్టును పునఃనిర్మించారు...

అందుకే నా దృష్టిలో టీమిండియా కెప్టెన్లలో మొదట ధోనీ, రాహుల్ ద్రావిడ్, ఆ తర్వాతే విరాట్ కోహ్లీ వస్తాడు... విరాట్ నేను కలిసి కొన్ని అమూల్యమైన భాగస్వామ్యాలు నెలకొల్పాం...

అతను తన బ్యాటింగ్‌తో కొన్ని రికార్డులు కూడా నెలకొల్పాడు. అందుకే రాహుల్ ద్రావిడ్ తర్వాతి స్థానం విరాట్ కోహ్లీకి ఇస్తాను...’ అంటూ కామెంట్ చేశాడు సురేష్ రైనా...

సురేష్ రైనాని ఎమ్మెస్ ధోనీ భక్తుడిగా పిలుస్తుంటారు చాలామంది. మాహీ కెప్టెన్సీలో జట్టులో ఎక్కువకాలం కొనసాగించిన రైనా, అతని రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే తాను కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు...

ఐపీఎల్‌లోనూ మాహీ ఆడితేనే ఆడుతా, లేదంటే లీగ్ మ్యాచులు ఆడడం కూడా మానేస్తానని ప్రకటించిన సురేష్ రైనా... ఎమ్మెస్ ధోనీ బెస్ట్ కెప్టెన్ అని చెప్పడంలో వింతేముందని అంటున్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్...

click me!