ఇలాంటి బౌలింగ్ ఉంటే, ఎప్పటికీ టైటిల్ గెలవలేరు.. ఆర్‌సీబీపై గంభీర్ చురకలు...

First Published Sep 16, 2021, 3:38 PM IST

ఐపీఎల్ 2021 ఫేజ్ 2 టోర్నీ కోసం అన్ని జట్లూ సిద్ధమవుతున్నారు. సెకండ్ ఫేజ్ ఆరంభానికి ముందు ఆర్‌సీబీ ప్రాక్టీస్ మ్యాచ్‌పై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. కానీ క్రికెట్ విశ్లేషకులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు...

ఆర్‌సీబీ ఇంట్రా స్వార్డ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్షల్ పటేల్ టీమ్ 212 పరుగులు చేస్తే, దాన్ని విజయవంతంగా ఛేదించింది దేవ్‌దత్ పడిక్కల్ జట్టు...

ఏబీ డివిల్లియర్స్ 46 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 104 పరుగులు చేయగా అజారుద్దీన్ 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు... లక్ష్యఛేదనలో తెలుగు కుర్రాడు కోన శ్రీకర్ భరత్ 47 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 95 పరుగులు చేశాడు...

సొంత జట్టు బ్యాట్స్‌మెన్‌కే భారీ స్కోరు అప్పగించిన ఆర్‌సీబీ బౌలర్లు.., ఆ లక్ష్యాన్ని నిలువరించడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు...

‘అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదారుగురు టాప్ బౌలర్లు అందుబాటులో ఉంటారు. ఒకరు కాకపోతే మరొకరిని ఆడించే అవకాశం ఉంటుంది...

అయితే ఐపీఎల్‌లో అలాంటి సౌకర్యం ఉండదు. మహా అయితే ఇద్దరు, ముగ్గురు ఇంటర్నేషనల్ బౌలర్లు మాత్రమే ఉంటారు. వారితో పాటు దేశవాళీ బౌలర్లతో రాణించాల్సి ఉంటుంది...

బ్యాట్స్‌మెన్ల ఎంపికలో భారీగా ఖర్చు పెట్టే రాయల్ ఛాలెంజర్స్, బౌలర్ల ఎంపికలో మాత్రం సరైన ప్లేయర్లను పట్టుకోలేకపోతోంది. అందుకే విరాట్, ఏబీ డివిల్లియర్స్‌పై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది...

ఏళ్లకు ఏళ్లు గడిచేకొద్దీ, ఆ ప్రెషర్ మరింత పెరుగుతోంది కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు ఆర్‌సీబీలో విరాట్ ఉన్నాడు, ఏబీ డివిల్లియర్స్ ఉన్నాడు, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి మ్యాచ్ విన్నర్ కూడా ఉన్నాడు...

జస్ప్రిత్ బుమ్రా లాంటి బౌలర్‌కి చుక్కలు చూపించగల సామర్థ్యం ఏబీ డివిల్లియర్స్ సొంతం. అయినా బౌలింగ్ యూనిట్ పటిష్టంగా లేకపోతే... మ్యాచులు గెలవలేం..

ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఎప్పుడో గ్రహించాడు. ఆర్‌సీబీ విషయంలోనూ అదే ఫార్ములా ఫాలో అయితేనే సక్సెస్ దక్కుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్...

ఈ ఏడాది ఏడు మ్యాచుల్లో 17 వికెట్లు తీసిన హర్షల్ పటేల్, పర్పుల్ క్యాప్‌ రేసులో టాప్‌లో నిలిచాడు. అయితే అతను డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పిస్తూ, జట్టుని విజయం నుంచి దూరం చేస్తున్నాడు..

భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన న్యూజిలాండ్ పేసర్ కేల్ జెమ్మీసన్ వికెట్లు తీస్తున్నా... ఆర్‌సీబీ అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు...

యజ్వేంద్ర చాహాల్, మహ్మద్ సిరాజ్ వంటి టీమిండియా సీనియర్ బౌలర్ల రాణింపుపైనే ఆర్‌సీబీ విజయాకాశాలు ఆధారపడి ఉన్నాయి...

click me!