టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో హాట్ ఫెవరెట్ జట్లుగా బరిలో దిగాయి టీమిండియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్. మిగిలిన జట్లు పోటీ ఇచ్చినా, టైటిల్ గెలిచేది మాత్రం ఈ మూడు జట్లలో ఒకటి అవుతుందని అంచనా వేశారు క్రికెట్ పండితులు. అయితే టోర్నీ ఆరంభమయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయ్యింది...
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీని ఆరంభించిన వెస్టిండీస్, వరుసగా మొదటి రెండు మ్యాచుల్లో ఓడింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఆరంభమ్యాచ్‌లో 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది విండీస్...
215
క్రిస్ గేల్, హెట్మయర్, బ్రావ్, పూరన్, రస్సెల్, పోలార్డ్ వంటి అరవీర భయంక బ్యాట్స్‌మెన్ ఉన్న జట్టు, ఇలా 55 పరుగులకే కుప్పకూలడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఇంగ్లాండ్ చేతుల్లో విండీస్ ఓడిపోవడం ఇదే తొలిసారి...
315
అలాగే పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఆరంభించింది టీమిండియా. దాయాది పాకిస్తాన్‌పై దుర్భేద్యమైన రికార్డు ఉండడంతో పాటు వార్మప్ మ్యాచుల్లో భారత బ్యాట్స్‌మెన్ ఇరగదీయడంతో టీమిండియా ఈజీగా గెలుస్తుందని అనుకున్నారంతా...
415
అయితే బ్యాటింగ్ విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ రాణించడంతో ఓ మాదిరి స్కోరు చేయగలిగిన భారత జట్టు, బౌలింగ్‌లో ఒక్కటంటే ఒక్క వికెట్ తీయలేక 10 వికెట్ల తేడాతో ఓడింది...
515
జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్న భారత జట్టు... ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం క్రికెట్ ప్రపంచానికి ఆశ్చర్యానికి గురి చేసింది... టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో టీమిండియా, పాక్ చేతుల్లో ఓడడం ఇదే తొలిసారి.
615
తొలి మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాభవం, ఆ తర్వాతి మ్యాచుల్లో ఆటతీరుపై ప్రభావం చూపిస్తుంది. టీమిండియా, వెస్టిండీస్ విషయంలోనూ ఇదే జరిగింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆచితూచి ఆడి భారీ మూల్యం చెల్లించుకుంది విండీస్...
715
ఓపెనర్ సైమన్స్ 35 బంతులాడినా 16 పరుగులే చేయడం, విండీస్ బ్యాట్స్‌మెన్ ఎంత ఒత్తిడికి లోనై, అతిజాగ్రత్తతో బ్యాటింగ్ చేశారో చెప్పడానికి పర్ఫెక్ట్ ఉదాహరణ...
815
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు పరిస్థితి కూడా సరిగ్గా ఇదే. ఓపెనర్లు ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ షాట్లు ఆడి అవుట్ కావడంతో ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ బౌండరీలు కొట్టడానికే భయపడ్డారు...
915
విరాట్ కోహ్లీ 17 బంతులాడి 9 పరుగులే చేయడం, రిషబ్ పంత్ 19 బంతులు ఆడినా 12 పరుగులు మాత్రమే చేయడం, హార్ధిక్ పాండ్యా 24 బంతులాడి 23 పరుగులే చేయడం వాళ్లు ఎంత ఒత్తిడికి లోనయ్యాలో తెలియచేస్తుంది...
1015
మొదటి రెండు మ్యాచుల్లో ఓడినా, మూడో మ్యాచ్‌లో గెలిచి మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాయి వెస్టిండీస్, టీమిండియా. భారత జట్టు, పసికూన ఆఫ్ఘాన్‌పై 66 పరుగుల భారీ విజయం అందుకుంటే, వెస్టిండీస్ బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో ఆఖరి బంతికి విజయం అందుకుంది...
1115
వెస్టిండీస్‌కి రెండు టీ20 వరల్డ్‌కప్ టైటిల్స్ ఉన్నాయి. అయితే ఈ వరల్డ్‌కప్ టోర్నీలో విండీస్ ఆడిన విధానం చూస్తే ఏ మాత్రం ఛాంపియన్ టీమ్ అనిపించలేదు... కారణం భారీ అంచనాలను మోయలేకపోవడమే...
1215
క్రిస్ గేల్, కిరన్ పోలార్డ్, ఆండ్రే రస్సెల్, డీజే బ్రావో వంటి సీనియర్లు వరుసగా టీ20 లీగ్‌లు ఆడుతూ యమ బిజీగా గడిపిస్తున్నారు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆడిన తర్వాత వారం కూడా గడవకముంటే ఐపీఎల్ ఆడారు...
1315
క్రిస్ గేల్, ఐపీఎల్ ఆఖర్లో విశ్రాంతి తీసుకున్నా, రస్సెల్, పోలార్డ్, హెట్మయర్ వంటి ప్లేయర్లు దాదాపు ఐపీఎల్ ముగిసేదాకా బయో బబుల్‌లో గడిపారు. టీమిండియా ప్లేయర్ల పరిస్థితి కూడా సేమ్...
1415
ఇంగ్లాండ్ టూర్‌లో వరుసగా నాలుగు టెస్టు మ్యాచులు ఆడిన టీమిండియా, ఐదో టెస్టు అర్ధాంతరంగా రద్దు కావడంతో యూఏఈ చేరుకుంది. ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌లో పాల్గొని టీ20 వరల్డ్‌కప్ టోర్నీని ఆరంభించింది...
1515
వెస్టిండీస్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. అయితే టీమిండియా పరిస్థితి ఇంకా అయిపోలేదు కానీ ప్లేఆఫ్స్ చేరాలంటే ఆఫ్ఘాన్ అద్భుతం చేయాలని కోరుకునే పరిస్థితుల్లో పడింది.. ఈ రెండు టీమ్స్ పరిస్థితికి కారణం ఒక్కటే భారీ అంచనాలు, అలసట లేని క్రికెట్ అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...