తన జెర్సీ నెంబర్ వెనకున్న సీక్రెట్ చెప్పిన రోహిత్ శర్మ... 2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో అలా...

First Published Nov 5, 2021, 4:57 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఆడిన మొదటి రెండు మ్యాచుల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు భారత ఓపెనర్ రోహిత్ శర్మ. అయితే ఆఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టి, భారత జట్టు భారీ స్కోరు చేయడానికి కారణమయ్యాడు...

పాకిస్తాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూగా అవుటై, గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు రోహిత్ శర్మ. న్యూజిలాండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దాదాపు అదే సీన్ రిపీట్ అయ్యేది...

రోహిత్ శర్మ ఆడిన ఫుల్ షాట్ నేరుగా వెళ్లి న్యూజిలాండ్ ఫీల్డర్ ఆడమ్ మిల్నే చేతుల్లో పడింది. అయితే ఆ క్యాచ్‌ను మిల్నే జారవిడచడంతో బతికిపోయిన రోహిత్, ఆ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చి 14 బంతుల్లో 14 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేసిన రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌తో కలిసి మొదటి వికెట్‌కి 140 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు...

‘2016 నుంచి ఇప్పటిదాకా ఈ మధ్యలో నేను చాలా క్రికెట్ ఆడాను. మంచి అనుభవాన్ని సంపాదించాను. 2016తో పోలిస్తే ఇప్పుడు నేనే చాలా మెచ్యూర్డ్ బ్యాట్స్‌మెన్‌ని.. 

జట్టుకి ఏం కావాలో అవసరం చేసుకుని, దానికి తగ్గట్టుగా మనల్ని మనం మలుచుకున్నప్పుడే మంచి క్రికెటర్ అవుతాడు. జట్టు విజయాల్లో భాగస్వామ్యాలు కీ రోల్ పోషిస్తాయి...

ఓపెనింగ్ చేసినప్పుడు సాధ్యమైనన్ని ఎక్కువ బంతులను ఎదుర్కోవడానికి అవకాశం దొరుకుతుంది. అందుకే టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన వారిలో ఎక్కవ మంది ఓపెనర్లే ఉంటారు... నా పని కూడా అదే...

ఈ మధ్యకాలంలో నేను చాలా సెంచరీలు చేశా. గేమ్‌లో ఎక్కువ కాలం ఇమిడిపోవడం వల్ల సెంచరీలు ఎలా చేయాలనేదానిపై స్పష్టత వచ్చింది. భయం లేకుండా ఏ బౌలర్‌నైనా ఎదుర్కోగలుగుతున్నా...

అవుట్ అవుతాననే భయం నాకెప్పుడూ లేదు. ఆ భయం ఉంటే సరిగా ఆడలేం. 2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీ వ్యక్తిగతంగా నాకు చాలా చాలా స్పెషల్. ఆ టోర్నీలో నేను ఐదు సెంచరీలు చేశా...

క్రీజులోకి వెళ్లిన ప్రతీసారీ పరుగులు చేస్తుంటే ఆ మజా వేరేగా ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు టైటిల్ గెలవలేకపోయాం. టైటిల్ రానప్పుడు ఎన్ని సెంచరీలు చేసినా, ఎన్ని పరుగులు చేసినా ఏం లాభం... అవన్నీ వృథాయే’ అంటూ కామెంట్ చేశాడు రోహిత్ శర్మ...

అలాగే తన జెర్సీ నెంబర్ 45 వెనకున్న రహస్యం కూడా బయటపెట్టాడు రోహిత్. ‘నేను టీమ్‌కి సెలక్ట్ అయిన తర్వాత ఏ నెంబర్ తీసుకోవాలా? అని చాలా ఆలోచించా...

మా అమ్మని అడగితే 45 తీసుకొమ్మని చెబితే. అది ఆమె లక్కీ నెంబర్. 4+5=9 శుభాలను చేకూరుస్తుందని అమ్మ విశ్వాసం. అందుకే నేను దాన్ని సెలక్ట్ చేసుకున్నా...’ అంటూ కామెంట్ చేశాడు రోహిత్ శర్మ...

click me!