ఓడిన ప్రతీసారి ఓ బలిపశువుని వెతికేవాళ్లం... పాకిస్తాన్ మాజీ కోచ్ మిస్బావుల్ హక్ కామెంట్స్...

First Published Nov 14, 2021, 6:40 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ ప్రదర్శన సంచలనమే. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగిన పాకిస్తాన్, గ్రూప్ స్టేజ్‌లో ఐదుకి ఐదు విజయాలు అందుకున్న ఏకైక జట్టుగా నిలిచి, సెమీస్‌కి అర్హత సాధించింది... 

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ మొదటి మ్యాచ్‌లో భారత జట్టును ఓడించి, ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియాపై తొలి విజయాన్ని నమోదుచేసిన పాకిస్తాన్... ఆ తర్వాత న్యూజిలాండ్, ఆఫ్ఘాన్, స్కాట్లాండ్, నమీబియాలను ఓడించి... గ్రూప్ స్టేజ్‌లో ఐదుకి ఐదు విజయాలు అందుకున్న జట్టుగా నిలిచింది...

సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో పోరాడి ఓడిన పాకిస్తాన్, 18వ ఓవర్ వరకూ గట్టి పోటీ ఇచ్చింది. టీమిండియా, వెస్టిండీస్ వంటి టీమ్స్‌తో పోలిస్తే పాకిస్తాన్ అదిరిపోయే పర్పామెన్స్ ఇచ్చింది...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఆరంభానికి ముందు పాక్ జట్టు పరిస్థితి ఏ మాత్రం సజావుగా సాగలేదు. పొట్టి ప్రపంచకప్‌కి జట్టుని ప్రకటించిన కొద్దిసేపటికే హెడ్ కోచ్ మిస్బావుల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ తమ పదవులకి రాజీనామా చేశారు...

పీసీబీ ఎంపిక చేసిన జట్టుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మిస్బావుల్ హక్, ఇలాంటి జట్టుతో ఆడడం కంటే ఆడకపోవడమే బెటర్ అని హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు మిస్బా వుల్ హక్...

‘పాకిస్తాన్‌లో మేం ఒకే ఒక్క దానిపైన ఫోకస్ పెడతాం. అది రిజల్ట్. మా ప్లేయర్లు ఎవరు? వారి స్కిల్స్ ఏంటి? వాటిని ఎలా మెరుగుపరచాలి వంటి వాటిని ఏ మాత్రం పట్టించుకోం...

అందుకే ప్రతీ మ్యాచ్ ఓడినప్పుడు, సిరీస్ ఓడినప్పుడు ఓ బలిపశువును వెతికే వాళ్లం. సరిగా రాణించని ఓ ప్లేయర్‌పై ఓటమి భారాన్ని మోపి, అతన్ని టీమ్ నుంచి తప్పించేవాళ్లం...

లోపలున్న సమస్యలన్నీ కప్పిపుచ్చడానికి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేస్తూ పోతే, ఆటతీరులో ఎలాంటి మార్పు ఉండదు. కోచ్‌లను మార్చినా, ప్లేయర్లను మార్చినా... సమస్యలకు పరిష్కార మార్గం కనుక్కోకపోతే ఫలితం మారదు...

సెలక్టర్లు జట్టులో మార్పులు చేసేవాళ్లు, వాళ్లు సరిగ్గా ఆడలేదని 10 రోజులకి మళ్లీ పాత ప్లేయర్లనే టీమ్‌లోకి తెచ్చేవాళ్లు. ఇలా చేస్తూ ఉంటే, టీమ్ ఎప్పటికీ బాగవుతుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు పాక్ మాజీ కోచ్ మిస్బావుల్ హక్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టుపై తీవ్ర విమర్శలు రావడంతో పాక్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ స్వయంగా కలుగచేసుకుని ప్రపంచకప్ జట్టులో మార్పులు చేశాడు...

మిస్బావుల్ హక్ అర్ధాంతరంగా రాజీనామా చేయడంతో అతని స్థానంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడేన్‌ని హెడ్ కోచ్‌గా నియమించింది పాక్ క్రికెట్ బోర్డు...

పాకిస్తాన్ తరుపున 75 టెస్టులు, 162 వన్డేలు, 39 టీ20 మ్యాచులు ఆడిన మిస్బావుల్ హక్, ఓవరాల్‌గా 11 వేలకు పైగా పరుగులు చేశాడు. 2007 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో మిస్బావుల్ హక్ ఒక్కడే ఒంటరిపోరాటం చేసి, ఆఖరి దాకా మ్యాచ్‌ను తీసుకెళ్లాడు.

click me!