టీమిండియాతో ఆడితే అంతే... కివీస్‌ను భయపెడుతున్న సెంటిమెంట్, భారత జట్టుతో తలబడిన ఏ టీమ్...

First Published Nov 14, 2021, 6:06 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలబడబోతున్నాయి. రెండు సమవుజ్జీల మధ్య సమరంగా జరుగుతున్న ఈ ఫైనల్‌లో విజేత ఎవరో చెప్పడం చాలా కష్టం. అయితే ఓ సెంటిమెంట్ మాత్రం న్యూజిలాండ్ ఫ్యాన్స్‌ని తెగ కలవరపెడుతోంది...

టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత జట్టుతో కలిసి గ్రూప్ స్టేజ్‌లో తలబడిన ఏ టీమ్ కూడా టైటిల్ గెలవలేకపోయింది. ఇప్పటిదాకా జరిగిన ఆరు సీజన్లలో ఇదే జరిగింది...

2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత జట్టుతో పాటు స్కాట్లాండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. వీరిలో టీమిండియా, పాకిస్తాన్ ఫైనల్ చేరగా... ధోనీ సేన, పాక్‌ను చిత్తు చేసి టైటిల్ గెలిచింది...

2009 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో బంగ్లాదేశ్, ఐర్లాండ్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు ఒకే గ్రూప్‌లో తలబడ్డాయి. ఈ జట్లలో టీమ్ కూడా ఫైనల్ చేరలేకపోయాయి. ఫైనల్‌లో శ్రీలంకని ఓడించిన పాకిస్తాన్, టీ20 వరల్డ్‌కప్ టైటిల్ గెలిచింది...

2010 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంక జట్లతో గ్రూప్ స్టేజ్‌లో తలబడింది భారత జట్టు. ఈ గ్రూప్ నుంచి ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా జట్టు, ఇంగ్లాండ్ చేతుల్లో ఓడింది...

2012 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత జట్టు, గ్రూప్ స్టేజ్‌లో ఆఫ్ఘినిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికాలతో మ్యాచులు ఆడింది. ఫైనల్ చేరిన శ్రీలంక, వెస్టిండీస్ జట్లు, టీమిండియాతో మ్యాచ్ ఆడలేదు. ఈ టోర్నీలో వెస్టిండీస్ విజేతగా నిలిచింది...

2014 టీ20 వరల్డ్‌కప్ టోర్నీ గ్రూప్ స్టేజ్‌లో పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలతో మ్యాచులు ఆడింది. ఈ టోర్నీలో భారత జట్టు ఫైనల్ చేరగా, గ్రూప్ స్టేజ్‌లో ఆడని శ్రీలంక చేతుల్లో ఓడింది....

2016 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లతో గ్రూప్ మ్యాచులు ఆడింది. ఈ ఎడిషన్‌లో కూడా భారత జట్టుతో గ్రూప్ మ్యాచులు ఆడని వెస్టిండీస్, ఇంగ్లాండ్‌ని ఓడించి విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో సెమీస్ చేరిన భారత జట్టు, వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఓడింది. 

ఇదే సెంటిమెంట్ రిపీట్ అయితే మాత్రం గ్రూప్ స్టేజ్‌లో టీమిండియా మ్యాచ్ ఆడిన న్యూజిలాండ్‌కి టైటిల్ దక్కడం అనుమానమే. ఒకవేళ ఫైనల్‌లో కివీస్, ఆస్ట్రేలియాను ఓడిస్తే మాత్రం భారత జట్టు ఉన్న గ్రూప్ నుంచి టైటిల్ నెగ్గిన తొలి జట్టుగా రికార్డు క్రియేట్ చేస్తుంది. 

click me!