త్వరలో టీ20లకు విరాట్ కోహ్లీ గుడ్‌బై, ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతూ... టీమిండియా కెప్టెన్‌పై పాక్ మాజీల...

First Published Nov 11, 2021, 6:34 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఆరంభానికి ముందే టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా వైదొలుగుతున్నట్టు సంచలన ప్రకటన చేశాడు విరాట్ కోహ్లీ. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కెప్టెన్సీ కూడా స్వస్తి పలుకుతున్నట్టు చెప్పిన విరాట్, కొత్త కెప్టెన్ సారథ్యంలో ప్లేయర్‌గా ఆడేందుకు సిద్ధమంటూ ప్రకటించాడు...

ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ ఆరంభానికి ముందే టీమిండియా టీ20 కెప్టెన్సీకి, ఆర్‌సీబీ కెప్టెన్సీకి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించిన విరాట్ కోహ్లీ, ఈ రెండు టోర్నీల్లోనూ కెప్టెన్‌గా సక్సెస్ అందుకోలేకపోయాడు...

కెప్టెన్‌గా ఆడిన ఆఖరి ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, మొదటి ఎలిమినేటర్‌లో కేకేఆర్ చేతుల్లో ఓడి నాలుగో స్థానంలో నిలవగా, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా మొదటి రెండు మ్యాచుల్లో పాక్, న్యూజిలాండ్ చేతుల్లో ఓడి గ్రూప్ స్టేజ్‌కే పరిమితమైంది...

కెప్టెన్‌గా తన కెరీర్‌లో రెండే రెండు టీ20 సిరీసుల్లో ఓడిన విరాట్ కోహ్లీ, వరుసగా 9 సిరీసుల్లో విజయాలు అందుకోగలిగాడు. టీమిండియా ఓడిన ఆఖరి రెండు టీ20 సిరీస్‌లు రోహిత్, శిఖర్ ధావన్ కెప్టెన్సీలోవే కావడం విశేషం. 

టీ20ల్లో అత్యధిక పరుగులు, అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా టాప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, కెప్టెన్‌ కాకపోతే జట్టులో కూడా ఉండడంటూ కొందరు హేటర్స్ వ్యాఖ్యలు కూడా చేశారు...

తాజాగా విరాట్ కోహ్లీ త్వరలోనే టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నాడని, అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు పాక్ మాజీ క్రికెటర్ ముస్తాక్ అహ్మద్...

‘ఓ సక్సెస్‌ఫుల్ కెప్టెన్, సడెన్‌గా ఇలా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పాడంటే ఆ డ్రెస్సింగ్ రూమ్‌లో పరిస్థితి బాగోలేదని అర్థం... నాకెందుకో టీమిండియాలో లుకలుకలు ఉన్నాయని అనిపిస్తోంది...

భారత డ్రెస్సింగ్ రూమ్‌లో రెండు గ్రూప్‌లు ఉన్నాయని అనిపిస్తోంది. అవి ముంబై, ఢిల్లీ గ్రూప్‌లు కావచ్చు... కోహ్లీ వైపు ఉన్నవాళ్లు, రోహిత్‌కి సపోర్ట్‌గా ఉన్నవారిగా టీమ్ విడిపోయినట్టుంది...

అదే నిజమైతే విరాట్ కోహ్లీ త్వరలోనే టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటాడు. అయితే ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతాడని అనుకుంటున్నా. ఎందుకంటే టీ20 ఫార్మాట్ ఆడాలనే అతని కోరిక ఐపీఎల్ ద్వారా తీరుతుంది...

నా ఉద్దేశంలో టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియా ఓటమికి ఐపీఎల్‌యే కారణం. బయో బబుల్‌లో ఎన్నో నెలలుగా గడుపుతుండడంతో వాళ్లు అలసిపోయి ఉండొచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ ముస్తాక్ అహ్మద్...

పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా భారత క్రికెట్ జట్టులో రెండు గ్రూపులు తయారయ్యాయని అనుమానం వ్యక్తం చేశాడు. అందుకే కోహ్లీ, టీ20 కెప్టెన్సీని వదులుకుని ఉండొచ్చని కామెంట్ చేశాడు అక్తర్...

click me!