T20 World Cup: 14 ఏళ్ల క్రితం రికార్డును బద్దలు కొట్టిన రోహిత్, రాహుల్.. అదేమిటంటే..?

First Published Nov 4, 2021, 10:20 AM IST

టీ 20 ప్రపంచ్‌కప్‌లో (T20 World Cup) భారత జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. తొలి రెండు మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీమిండియా బుధవారం అఫ్గానిస్తాన్‌‌తో (Afghanistan) జరిగిన మ్యాచ్‌లో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ 14 ఏళ్ల క్రితం నాటి రికార్డును బద్దలు కొట్టారు.

టీ 20 ప్రపంచ్‌కప్‌లో (T20 World Cup) భారత జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. తొలి రెండు మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీమిండియా బుధవారం అఫ్గానిస్తాన్‌‌తో (Afghanistan) జరిగిన మ్యాచ్‌లో ఘన విజయాన్ని అందుకుంది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు అఫ్గానిస్తాన్ ముందు 210‌ పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఓవర్ నుంచే అఫ్గాన్‌పై భారత బ్యాట్స్‌మెన్ విరుచుకుపడ్డారు. ఓపెనర్స్ కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు రెచ్చిపోయి ఆడారు. తొలి వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 
 

దీంతో 14 ఏళ్ల క్రితం రికార్డును రోహిత్, రాహుల్ బ్రేక్ చేశారు. టీ 20 వరల్డ్ కప్‌లో టీమిండియా తరఫున అత్యధిక పార్ట్నర్‌షిప్ నెలకొల్పిన ఆటగాళ్లుగా నిలిచారు. అంతకు ముందు 2007లో టీ20 ప్రపంచ‌ కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌పై తొలి వికెట్‌కు టీమిండియా ఓపెనర్స్ గంభీర్, వీరేంద్ర సేహ్వాగ్ ‌ 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

 తాజాగా ఆ రికార్డును రోహిత్, రాహుల్‌లు బ్రేక్ చేశారు. 2007లో జరిగిన ఆ మ్యాచ్‌లోనే టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్స్ బాదాడు. దీంతో ఆ మ్యాచ్ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. 

ఇక, ఇప్పటివరకు టీ20ల్లో రాహుల్, రోహిత్ కలిసి 23 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయగా.. 4 సార్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక, పాకిస్థాన్‌కు ఆటగాళ్లు.. బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ 19 ఇన్నింగ్స్‌లలో ఐదు సెంచరీలతో ఆ రేసులో ముందంజలో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ (47 బంతుల్లో 74.. 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌ (48 బంతుల్లో 69.. 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. పంత్, హార్దిక్ పాండ్యాలు మెరుపులు మెరిపించారు. దీంతో భారత జట్టు అఫ్గానిస్తాన్‌పై 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. 
 

ఈ మ్యాచ్‌ గెలుపుతో టీమిండియా గ్రూప్‌ 2 లో నాలుగో స్థానానికి చేరింది. దీంతో టీమిండియా సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. టీమిండియా సెమీస్‌ చేరుకోవాలంటే.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. అయితే మిగిలిన జట్ల ఆటపై కూడా భారత్ సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. . 

ముఖ్యంగా భారత్‌ కన్నా మెరుగైన స్థితిలో ఉన్న న్యూజిలాండ్.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కనబరిచే ప్రదర్శన, అఫ్గాన్ తదుపరి మ్యాచ్‌లో సాధించే ఫలితంపై భారత్ సెమీస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి

click me!