టీ20 వరల్డ్‌కప్‌లో ఆఖరిగా వికెట్ తీసిన భారత బౌలర్‌ ఎవరో తెలుసా... విరాట్ కోహ్లీ తర్వాత...

First Published Oct 31, 2021, 3:32 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు భారత బౌలర్లు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు 18 ఓవర్లు బౌలింగ్ చేసినా వికెట్ మాత్రం తీయలేకపోయారు. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో చివరిగా వికెట్ తీసిన బౌలర్ ఎవరో తెలుసా... విరాట్ కోహ్లీ...

బ్యాట్స్‌మెన్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డులను కొల్లగొడుతున్న విరాట్ కోహ్లీకి, బౌలింగ్‌లో మాత్రం చెప్పుకోదగ్గ రికార్డు లేదు. అయితే ఆడపాదడపా బౌలింగ్ చేసే విరాట్ కోహ్లీ కొన్ని రికార్డులు మాత్రం క్రియేట్ చేయగలిగాడు...

2011లో విరాట్ కోహ్లీ ఒక్క అధికారిక బంతి కూడా వేయకుండానే వికెట్ తీయగలిగాడు. అదెలాగంటే ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీకి బంతి అందించాడు అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... 

తొలి బంతిని వైడ్‌గా వేశాడు విరాట్ కోహ్లీ. అయితే బంతిని అందుకున్న కీపర్ ధోనీ స్టంపౌట్ చేయడంతో అధికారిక బంతి పడకుండానే 0.0 బంతుల్లో తొలి వికెట్ తీశాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్‌ విరాట్‌కి ఐదో టీ20 మ్యాచ్ కావడం విశేషం. 

అలాగే 2012 వరల్డ్‌కప్ టోర్నీలోనూ పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ తీశాడు విరాట్ కోహ్లీ. పాక్ కెప్టెన్ మహ్మద్ హఫీజ్, విరాట్ కోహ్లీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

అంతేకాకుండా టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో వికెట్ తీసిన భారత ఆఖరి బౌలర్ విరాట్ కోహ్లీయే కావడం విశేషం... 2016 టీ20 వరల్డ్‌కప్ సెమీ ఫైనల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ జాన్సన్ చార్లెస్ వికెట్ తీశాడు విరాట్ కోహ్లీ...

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ స్కోరు చేసింది. రోహిత్ శర్మ 43, అజింకా రహానే 40 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 89 పరుగులు చేశాడు...

మహేంద్ర సింగ్ ధోనీ 9 బంతుల్లో 15 పరుగులు చేశాడు. లక్ష్యఛేదనలో క్రిస్ గేల్‌ను 5 పరుగులకే బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత 8 పరుగులు చేసిన శామూల్స్‌ను ఆశీష్ నెహ్రా అవుట్ చేశాడు...

19 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత జాన్సన్ చార్లెస్, లిండెల్ సిమన్స్ కలిసి 97 పరుగులు జోడించారు. 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేసిన జాన్సన్, కోహ్లీ బౌలింగ్‌లో రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

అయితే ఆ తర్వాత సిమన్స్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 82 పరుగులు, రస్సెల్ 20 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించారు...

ఆశీష్ నెహ్రా మినహా బుమ్రా, జడేజా, హార్ధిక్ పాండ్యా, అశ్విన్ భారీగా పరుగులు సమర్పించారు. ఆఖరి ఓవర్‌లో విజయానికి 7 పరుగులు కావాల్సిన దశలో విరాట్ కోహ్లీకే బంతి అందించాడు ధోనీ.

అప్పటికే ఆశీష్ నెహ్రా, బుమ్రా, హార్ధిక్ పాండ్యాల కోటా ముగించేశారు. అశ్విన్, జడేజా అప్పటికే భారీగా పరుగులు సమర్పించారు. అదీకాకుండా ఆఖరి ఓవర్‌లో స్పిన్నర్‌కి ఇవ్వడం కరెక్ట్ కాదుని భావించిన ధోనీ, కోహ్లీ చేతికి బంతి ఇచ్చాడు. మొదటి రెండు బంతుల్లో సింగిల్ మాత్రమే రాగా ఆ తర్వాత వరుసగా ఓ ఫోర్, సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు రస్సెల్..

click me!