వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన ఆఖరి భారత జట్టు ఇదే... సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో...

Published : Oct 30, 2021, 06:52 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో న్యూజిలాండ్ జట్టుతో తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. పాకిస్తాన్ వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి, టాప్‌లో ఉండడంతో గ్రూప్ 2లో సెకండ్ సెమీఫైనలిస్ట్‌ని నిర్ణయించే మ్యాచ్‌గా మారింది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్...

PREV
112
వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన ఆఖరి భారత జట్టు ఇదే... సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో...

ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో టీమిండియాకి న్యూజిలాండ్‌పై పెద్దగా చెప్పుకోదగ్గ రికార్డు లేదు. గత 18 ఏళ్లల్లో న్యూజిలాండ్‌పై ఐసీసీ టోర్నీల్లో విజయాన్ని అందుకోలేకపోయింది భారత జట్టు...

212

టీమిండియా టైటిల్ గెలిచిన 2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత జట్టు ఎదుర్కొన్న ఏకైక ఓటమి న్యూజిలాండ్‌పైనే... గ్రూప్ Eలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 190 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 

312

191 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకి శుభారంభం దక్కింది. ఓపెనర్లు గౌతమ్ గంభీర్ 51, వీరేంద్ర సెహ్వాగ్ 40 పరుగులు చేయడంతో 10 ఓవర్లలో 100+ పరుగులు చేసింది భారత జట్టు. అయితే మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ వైఫల్యంలో 180/9 పరుగులకి పరిమితమైంది భారత జట్టు..

412

ఆ తర్వాత 2009, 2010, 2012, 2014 టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచులను చూసే అవకాశం దక్కలేదు. అయితే ఆఖరి టీ20 వరల్డ్‌కప్ 2016లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొంది భారత జట్టు...

512

గ్రూప్ 2లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 126/7 పరుగులు చేసింది. 127 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన టీమిండియా 79 పరుగులకి ఆలౌట్ అయ్యింది. విరాట్ కోహ్లీ 23, ఎమ్మెస్ ధోనీ 30, అశ్విన్ 10 తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ డబుల్ డిజిట్ స్కోరు కూడా చేరుకోలేకపోయారు..

612

న్యూజిలాండ్ స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్ 4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, ఇష్ సోదీ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. టీమిండియాకి టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇదే అత్యల్ప స్కోరు...

712

2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 239/8 పరుగులు చేయగా, భారత జట్టు 221 పరుగులకి ఆలౌట్ అయ్యింది. రవీంద్ర జడేజా 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేయగా ఎమ్మెస్ ధోనీ 72 బంతుల్లో 50 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు...

812

న్యూజిలాండ్‌పై వరల్డ్‌కప్ విజయాన్ని అందుకున్న చివరి జట్టు సౌరవ్ గంగూలీలోని 2003 వన్డే వరల్డ్‌కప్ జట్టు. అండర్‌ డాగ్‌గా బరిలో దిగి, అద్భుత విజయాలతో ఫైనల్ చేరింది 2003 వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా...

912

ఈ టోర్నీలో సూపర్ 7లో న్యూజిలాండ్, టీమిండియా మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 146 పరుగులకి ఆలౌట్ అయ్యింది. జహీర్ ఖాన్ 4 వికెట్లు తీయగా హర్భజన్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. జవగళ్ శ్రీనాథ్, ఆశీష్ నెహ్రా, వీరేంద్ర సెహ్వాగ్, దినేష్ మోంగియా ఒక్కో వికెట్ తీశారు...

1012

147 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన టీమిండియాకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ విరేంద్ర సెహ్వాగ్ 1 పరుగుకే అవుట్ కాగా, గంగూలీ 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. మంచి ఫామ్‌లో ఉన్న సచిన్ టెండూల్కర్ 15 పరుగులకు అవుట్ అయ్యాడు.

1112

21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో మహ్మద్ కైఫ్, రాహుల్ ద్రావిడ్ కలిసి టీమిండియాని ఆదుకున్నారు. మహ్మద్ కైఫ్ 129 బంతుల్లో 8 ఫోర్లతో 68 పరుగులు, రాహుల్ ద్రావిడ్ 89 బంతుల్లో 7 ఫోర్లతో 53 పరుగులు చేసి భారత జట్టుకి 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు...

1212

2003 వన్డే వరల్డ్‌కప్ ఆడిన జట్టులో ఉన్న హర్భజన్ సింగ్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌‌కి రిటైర్మెంట్ ప్రకటించలేదు. యువరాజ్ సింగ్ గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే... 

click me!

Recommended Stories