హార్ధిక్ పాండ్యా ఉంటాడు, అవసరమైతే నేను బౌలింగ్ చేస్తా... శార్దూల్ ఠాకూర్‌కి కూడా... విరాట్ కోహ్లీ కామెంట్స్..

First Published Oct 30, 2021, 8:27 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది భారత జట్టు. ఈ మ్యాచ్ ఎఫెక్ట్‌తో న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో పడింది టీమిండియా...

న్యూజిలాండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా కొన్ని మార్పులతో బరిలో దిగితే ఫలితం ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు... అయిటే టీమిండియా మాత్రం పాత జట్టుతోనే బరిలో దిగాలని చూస్తోంది...

పాక్‌తో మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఇద్దరూ భారీగా పరుగులు సమర్పించారు. దీంతో ఆరో బౌలింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంటే బాగుంటుందని శార్దూల్‌ను ఆడించాలని కామెంట్లు వినిపించాయి...

Latest Videos


‘హార్ధిక్ పాండ్యా భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అతను పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అయితే న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో అతను బౌలింగ్ వేస్తాడా? లేదా? అనేది చెప్పడం కష్టం...

బౌలింగ్ వేయకపోయినా హార్ధిక్ పాండ్యా జట్టులో ఉంటాడు. శార్దూల్ ఠాకూర్‌ను ఆడించాలని కూడా ఆలోచిస్తున్నాం. అతను జట్టుకి ఎంతో విలువైన ఆటగాడు...

అయితే శార్దూల్ ఠాకూర్, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఆడతాడా? లేడా? అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్లు తీయకపోయినా టీమ్‌లో వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు...

ఫీల్డ్‌లో అప్పటికప్పుడు ఎలా స్పందిస్తామనేది ముఖ్యం. హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేయకపోయినా అవసరమైతే ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా నేను బౌలింగ్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటా...

అయితే ఆరో బౌలర్ అవసరం వచ్చినప్పుడే, బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. జట్టులో ఉన్న ఐదుగురు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుంటే, ఆరో బౌలర్ అవసరం ఉండదు...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో వికెట్ తీసిన భారత ఆఖరి బౌలర్ విరాట్ కోహ్లీయే కావడం విశేషం... 2016 టీ20 వరల్డ్‌కప్ సెమీ ఫైనల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ జాన్సన్ చార్లెస్ వికెట్ తీశాడు విరాట్ కోహ్లీ...

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ స్కోరు చేసింది. రోహిత్ శర్మ 43, అజింకా రహానే 40 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 89 పరుగులు చేశాడు...

మహేంద్ర సింగ్ ధోనీ 9 బంతుల్లో 15 పరుగులు చేశాడు. లక్ష్యఛేదనలో క్రిస్ గేల్‌ను 5 పరుగులకే బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత 8 పరుగులు చేసిన శామూల్స్‌ను ఆశీష్ నెహ్రా అవుట్ చేశాడు...

19 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత జాన్సన్ చార్లెస్, లిండెల్ సిమన్స్ కలిసి 97 పరుగులు జోడించారు. 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేసిన జాన్సన్, కోహ్లీ బౌలింగ్‌లో రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

అయితే ఆ తర్వాత సిమన్స్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 82 పరుగులు, రస్సెల్ 20 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించారు...

ఆశీష్ నెహ్రా మినహా బుమ్రా, జడేజా, హార్ధిక్ పాండ్యా, అశ్విన్ భారీగా పరుగులు సమర్పించారు. ఆఖరి ఓవర్‌లో విజయానికి 7 పరుగులు కావాల్సిన దశలో విరాట్ కోహ్లీకే బంతి అందించాడు ధోనీ. మొదటి రెండు బంతుల్లో సింగిల్ మాత్రమే రాగా ఆ తర్వాత వరుసగా ఓ ఫోర్, సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు రస్సెల్..

click me!