మహ్మద్ షమీ వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ పోస్టులపై కూడా తమ ప్రతాపాన్ని చూపించాడు. ముస్లిం మతస్తుడవు కాబట్టే కావాలనే టీమిండియాని ఓడించావని, వెంటనే మీ పాకిస్తాన్‌కి వెళ్లిపోవాలంటూ పిచ్చి కూతలు కూశారు...
మహ్మద్ షమీపై అసభ్యపదజాలంతో విరుచుకుపడుతున్న నెటిజన్లను అదుపు చేసేందుకు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఫేస్‌బుక్,, కొన్ని వేల పోస్టులను గుర్తించి, డిలీట్ చేయాల్సి వచ్చింది...
తాజాగా భారత సారథి విరాట్ కోహ్లీ, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహ్మద్ షమీపై ఆన్‌లైన్ అటాక్ చేసిన వారిపై ఫైర్ అయ్యాడు...
‘భారత జట్టులోని ప్రతీ ఒక్కరూ టీమ్ గెలవాలనే ఉద్దేశంతోనే ఆడతారు. జాతీయ పతకాన్ని రెపరెపలాడించాలనే ఓ గొప్ప ఉద్దేశంతో క్రికెట్ ఆడతాం. అంతేకానీ ఈ వెన్నెముక లేని వెధవలను ఎంటర్‌టైన్ చేయడానికి కాదు.
మనిషికి ఎదురుపడి మాట్లాడే ధైర్యంలేని వాళ్లే, ఇలా సోషల్ మీడియాలో చెత్త వాగుడంతా పోస్టు చేస్తూ ఉంటారు. ఐడెంటెటీ చూపించుకోవడానికి కూడా ధైర్యం లేని వీళ్లు, ఇలా మనుషులను ట్రోల్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు...
సోషల్ మీడియా ఇలా ఎదుటివాళ్లని ఎగతాళి చేయడానికి, వారి ఎమోషన్స్‌తో ఆడుకోవడానికి వేదిక అవ్వడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఓ ప్లేయర్ మతాన్ని అడ్డుపెట్టుకుని, అతనిపై దాడి చేయడం ఎంతటి అమానవీయం...
మేం ఓ జట్టుగా, ప్రతీ ప్లేయర్‌ను అర్థం చేసుకుంటాం. మా క్యారెక్టరే మాకున్న బలం. మనంటూ ఓ క్యారెక్టర్ ఉండడం వల్లే మేమిప్పుడు ఇక్కడ ఉండగలిగాం. ఇలా ట్రోల్ చేసే వారికి దాని విలువ కూడా తెలీదు...
ఇలా వెన్నెముక లేకుండా నోటికి వచ్చినట్టు వాగుతూ, చేతికి వచ్చినట్టు చెత్తను పోస్టు చేసేవారిని ఎంకరేజ్ చేయకపోవడమే చాలా మంచిది. ఓ మ్యాచ్‌లో ఓడిపోయామనే బాధకంటే, వారి జీవితాల్లోనే ఫ్రస్టేషన్‌ని ఇలా చూపిస్తూ ఉంటారు...
ఇలా పోస్టులు చేసేవారికి వారిపై వారికి నమ్మకం ఉండదు. ఎదుటివాళ్లతో పోటీపడేందుకు సత్తా ఉండదు. అందుకే తమకంటే మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్లను తిట్టడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంటారు...
జట్టులో ప్రతీ ఒక్కరూ మహ్మద్ షమీకి అండగా ఉన్నాం. అతను మ్యాచ్ విన్నర్. 200 శాతం అతను తర్వాతి మ్యాచ్‌లో ఆడతాడు. ఎవరి సత్తా ఏంటో బయటివాళ్లు చెబితే తెలుసుకునే పొజిషన్‌లో మేం లేము...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...