కీలక మ్యాచ్‌లో ఇలాంటి చెత్త ప్రయోగాలా... ధోనీ, టీమిండియాను ఏం చేయాలనుకుంటున్నావ్..

Published : Oct 31, 2021, 08:26 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో మొదటి మ్యాచ్‌లోనే దాయాది పాకిస్తాన్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఓడింది టీమిండియా. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన నాలుగు మ్యాచుల్లోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి... అలాంటి స్థితిలో బ్యాటింగ్ ఆర్డర్‌లో చేసిన ప్రయోగాలు, ట్రోలింగ్‌కి కారణమవుతున్నాయి...

PREV
114
కీలక మ్యాచ్‌లో ఇలాంటి చెత్త ప్రయోగాలా... ధోనీ, టీమిండియాను ఏం చేయాలనుకుంటున్నావ్..

రోహిత్ శర్మకు ఓపెనర్‌గా అదిరిపోయే రికార్డు ఉంది. కెరీర్ ఆరంభంలో మిడిల్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా ఆడిన రోహిత్ శర్మ, పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు... 

214

రోహిత్ శర్మను ఓపెనర్‌గా మారుస్తూ తీసుకున్న నిర్ణయం సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రోహిత్ శర్మను వన్‌ డౌన్‌కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది టీమిండియా...

314

యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా పంపించింది. పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేని ఇషాన్ కిషన్‌ని ఓపెనర్‌గా పంపించాలనుకునే నిర్ణయం సరైనదే కావచ్చు, అయితే అతనితో పాటు రోహిత్ శర్మను ఓపెనర్‌గా పంపించాల్సింది...

414

కెఎల్ రాహుల్‌ ఏ పొజిషన్‌లో అయినా ఆడగల బ్యాట్స్‌మెన్. మిడిల్ ఆర్డర్‌లో సూపర్ సక్సెస్ అయ్యాడు కూడా. అలాంటిది కెఎల్ రాహుల్‌తో ఇషాన్ కిషన్‌ను  ఓపెనర్‌గా పంపిస్తూ తీసుకున్న నిర్ణయం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 

514

ఇషాన్ కిషన్ 8 బంతుల్లో ఓ ఫోర్ ‌తో 4 పరుగులు చేసి, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. టీ20 వరల్డ్‌కప్ ఆరంభమ్యాచ్‌లో సింగిల్ డిజిట్‌కే అవుటైన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు ఇషాన్ కిషన్.

614

ఇంతకుముందు 2016లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరగా, గత మ్యాచ్‌లో టీ20 వరల్డ్‌కప్ ఆరంగ్రేటం చేసిన కెఎల్ రాహుల్ 3 పరుగులకే అవుటైన విషయం తెలిసిందే.

714
rohit sharma trent boult

ఇషాన్ కిషన్ అవుటైన తర్వాతి బంతికే భారీ షాట్ ఆడబోయిన రోహిత్ శర్మ... అవుటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.

814

రోహిత్ శర్మ చేతుల్లోకి ఇచ్చిన క్యాచ్‌ను ఆడమ్ మిల్నే నేలపాలు చేశాడు. ఈ క్యాచ్ డ్రాప్‌తో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు...

914

16 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, టిమ్ సౌథీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు...

1014

ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా 14 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు.

1114

భారత జట్టు కోల్పోయిన మూడు వికెట్లలో ఏదీ అద్భుతమైన బౌలింగ్ కారణంగా పడింది కాదు. అందరూ భారీ షాట్లు ఆడడానికి ప్రయత్నించి, ఫీల్డర్ చేతుల్లోకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరినవాళ్లే.

1214

దీంతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసిన మెంటర్ మహేంద్ర సింగ్ ధోనీపై ట్రోల్స్ వస్తున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేయాలనుకుంటే నమీబియా, స్కాట్లాండ్‌తో జరిగే మ్యాచుల్లో చేయొచ్చు...

1314

ఆ మ్యాచ్‌లో టాపార్డర్ ఫెయిల్ అయినా... అనుభవం లేని జట్లపై మిడిల్ ఆర్డర్ రాణించేందుకు, బౌలర్లు తమ ప్రతాపం చూపించేందుకు అవకాశం ఉంటుంది... 

1414

అలాంటిది ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో ప్రయోగాలు చేసి, భారత బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి లోనవ్వడానికి కారణమైన మాహీని మెంటర్‌గా తీసేయాలని సోషల్ మీడియా ట్రోల్స్ మొదలైపోయాయి...

Read more Photos on
click me!

Recommended Stories