T20 Worldcup:‘హాలోవిన్’తో సందడి చేసిన భారత క్రికెటర్ల పిల్లలు.. ఈసారీ వామికను చూసే బాగ్యం దక్కలె..

First Published Oct 31, 2021, 4:52 PM IST

Halloween: హాలోవిన్.. ఇది పాశ్చాత్య క్రైస్తవుల పండుగ.  క్రిస్మస్ ప్రారంభానికి ముందు ప్రతి ఏటా అక్టోబర్ 31 న చాలా దేశాలు ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాయి.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో నేడు  భారత్-న్యూజిలాండ్ కీలక పోరుకు సిద్ధమవుతున్నాయి. తప్పక గెలవాల్సిన మ్యాచ్ కోసం భారత క్రికెటర్లు ఆ ప్రిపరేషన్స్ లో సిద్ధంగా ఉన్నారు. కానీ భారత క్రికెటర్ల (వివాహమైనవారి) పిల్లలు మాత్రం ‘హాలోవిన్’ సెలబ్రేట్ చేసుకున్నారు. పిల్లలంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. 

హాలోవిన్.. ఇది పాశ్చాత్య క్రైస్తవుల పండుగ.  క్రిస్మస్ ప్రారంభానికి ముందు ప్రతి ఏటా అక్టోబర్ 31 న చాలా దేశాలు ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాయి. ఈ రోజు వివిధ రూపాలలో వేషాలు వేసుకుని, ప్రార్థనలు చేసి, చనిపోయిన వారి సమాధులపై కొవ్వత్తులు వెలగిస్తారు. 

అయితే చిన్న పిల్లలు  ఈ పండుగను ఇష్టంగా జరుపుకుంటారు. దేవదూత, దెయ్యం, హాలోవిన్, సూపర్ మ్యాన్ రూపంలో అలంకరించుకుని ఎంజాయ్ చేస్తారు. శనివారం రాత్రి భారత  సారథి విరాట్-అనుష్క ల కూతురు వామిక, రోహిత్ శర్మ కూతురు అగస్త్య.. వివిధ రూపాలలో  వేషం వేసుకుని వారి నాన్నలను అలరించారు. 

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అశ్విన్, హార్థిక్ పాండ్యా ల పిల్లలు.. చిచ్చరపిడుగుల్లా మారి అల్లరి చేశారు. విరాట్ కూతురు వామికను దేవదూత వేషంలో అలంకరించారు. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా  ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. వామిక వెనుకనుంచే కనబడింది. వామిక ను చూడటానికి ఫ్యాన్స్ కు మరింత కాలం నిరీక్షణ తప్పేట్టులేదు. 

కాగా,  పిల్లలంతా వారి తల్లిదండ్రులతోనే గాక యంగ్ టీమిండియా బ్యాచ్.. రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ల దగ్గరికి వెళ్లి వారిని భయపెట్టారు. 

పిల్లలతో కలిసిన ఈ యంగ్ ఆటగాళ్లు వాళ్లతో కలిసి డాన్సులు చేశారు. వారిలో ఉత్సాహాన్ని నింపుతూ..  పిల్లలకు నచ్చిన ఆటలు ఆడారు. 
 

మొత్తానికి ప్రపంచకప్ రెండో మ్యాచ్ కు ముందు భారత శిబిరంలో ఈ హాలోవిన్..  ఐక్యతను పెంచింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య  విభేదాల గురించి చాన్నాళ్లుగా చాలామంది రాస్తున్నారు. అలాగే విరాట్-అశ్విన్ ల మధ్య కూడా చెడిందని వార్తలు వచ్చాయి. కానీ నిన్న అశ్విన్, విరాట్, రోహిత్ తమ కుటుంబాలతో కలిసి ఆనందంగా కనిపించారు. మ్యాచ్ కు ముందు భారత జట్టు మానసికోల్లాసం కలిగింది. 

click me!