వాళ్లందరికీ ఛాన్సే లేదు... సెమీస్ చేరేది వీళ్లే, ఫైనల్ ఆ రెండు జట్ల మధ్యే... షేన్ వార్న్ కామెంట్స్...

Published : Oct 31, 2021, 05:59 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగిన వెస్టిండీస్ జట్టు వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ను చచ్చీ చెడి గెలిచి, ప్లేఆఫ్ రేసులో నిలిచినా ఇప్పుడు విండీస్ సెమీస్ చేరాలంటే మ్యాజిక్ జరగాల్సిందే...

PREV
114
వాళ్లందరికీ ఛాన్సే లేదు... సెమీస్ చేరేది వీళ్లే, ఫైనల్ ఆ రెండు జట్ల మధ్యే... షేన్ వార్న్ కామెంట్స్...

మరో ఫెవరెట్ ఇంగ్లాండ్ మాత్రం వరుసగా మూడు విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. రన్‌రేట్ కూడా అద్భుతంగా ఉండడంతో ఇంగ్లాండ్ జట్టు దాదాపు సెమీస్ చేరినట్టే. ఇంకో మ్యాచ్ గెలిస్తే, మిగిలిన గణాంకాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది...

214

మిగిలిన జట్లతో పోలిస్తే పెద్దగా అంచనాలు లేకుండా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీని ఆరంభించింది పాకిస్తాన్. అయితే భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఆఫ్ఘాన్‌లను ఓడించి, దాదాపు సెమీస్ బెర్త్‌కి చేరువైపోయింది...

314

పటిష్టమైన టీమిండియా, న్యూజిలాండ్, ఆఫ్ఘాన్‌లను ఓడించిన పాకిస్తాన్‌కి... ఇక మిగిలిన మ్యాచుల్లో చిన్న దేశాలైన స్కాట్లాండ్, నమీబియాలపై విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు...

414

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో హాట్ ఫెవరెట్ టీమ్ టీమిండియా. వెస్టిండీస్ మిస్ చేసుకుంటే, టైటిల్ కచ్చితంగా ఇండియా ఎగరేసుకుపోతుందని అంచనా వేశారు క్రికెట్ విశ్లేషకులు...

514

ఈ టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోబోతుండడంతో అతనికి టైటిల్‌తో ఘనమైన ముగింపు అందిస్తారని భావించారు. అదీకాక మాహీ మెంటర్‌గా ఉండడంతో టీమిండియాకి తిరుగే ఉండదని భావించారు...

614

అయితే టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ చరిత్రలో మొట్టమొదటిసారి పాకిస్తాన్ చేతుల్లో పరాజయాన్ని చవి చూసింది టీమిండియా. అది కూడా అలా ఇలా కాదు, ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది...

714

దీంతో ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే న్యూజిలాండ్‌తో మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. మరోవైపు డబ్ల్యూటీసీ ఛాంపియన్‌షిప్ గెలిచిన న్యూజిలాండ్‌దీ అదే తీరు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ప్లేఆఫ్ రేసులో ఉంటుంది కివీస్..

814

తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్నర్ షేన్ వార్న్... టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో సెమీస్ చేరే జట్ల గురించి ఓ అంచనా వేశాడు. ఆయన ప్రకారం చూసుకంటే టీమిండియా సెమీస్ చేరడం గ్యారెంటీ...

914

గ్రూప్ 1 నుంచి టేబుల్ టాపర్‌గా ఉన్న ఇంగ్లాండ్, ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా సెమీస్ చేరతాయని అంచనా వేస్తున్నాడు ఆసీస్ మాజీ దిగ్గజం షేన్ వార్న్...

1014

అలాగే గ్రూప్ 2 నుంచి చిరకాల ప్రత్యర్థులు పాకిస్తాన్, ఇండియా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తాయని భావిస్తున్నాడు షేన్ వార్న్. పాకిస్తాన్ టేబుల్ టాపర్, ఇండియా రెండో స్థానంలో ఉంటుందని అంచనా వేస్తున్నాడు వార్న్...

1114

సెమీ ఫైనల్ మ్యాచుల్లో గ్రూప్ 1 టాపర్ ఇంగ్లాండ్, గ్రూప్ 2 సెకండ్ ప్లేస్ ఇండియాతో... గ్రూప్ 2 టాపర్ పాకిస్తాన్, గ్రూప్ 1 సెకండ్ ప్లేస్ సెమీ ఫైనలిస్ట్ ఆస్ట్రేలియాతో మ్యాచులు ఆడతాయి...

1214

ఏదీ ఏమైనా ఫైనల్‌లో మాత్రం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ లేదా ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ చూస్తామని అంటున్నాడు షేన్ వార్న్. అంటే ఒకే గ్రూప్ నుంచి రెండు జట్లు ఫైనల్ చేరతాయని అంచనా వేస్తున్నాడు వార్న్...

1314

ఇండియా 2007లో టీ20 వరల్డ్‌కప్ టైటిల్ గెలిస్తే, పాకిస్తాన్ ఆ తర్వాతి ఎడిషన్ 2009లో టైటిల్ సాధించింది. ఇంగ్లాండ్ జట్టు కూడా 2010లో టీ20 వరల్డ్‌కప్ సాధించింది. 2010 ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో ఓడిన ఆసీస్, ఆ తర్వాత ఫైనల్ కూడా చేరలేకపోయింది...

1414

ఈసారి కూడా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ముందు బంగ్లాదేశ్ టూర్‌లో, వెస్టిండీస్ టూర్‌లో టీ20 సిరీస్‌ను కోల్పోయింది ఆస్ట్రేలియా. అయితే వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.

Read more Photos on
click me!

Recommended Stories