నేను అతనిలాగే వాళ్ల టాపార్డర్‌ను పడగొడతా... అవునా, చూసుకుందాం మరి!... ట్రెంట్ బౌల్ట్, విరాట్ కోహ్లీ మధ్య...

First Published Oct 30, 2021, 4:37 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో న్యూజిలాండ్, టీమిండియా ఒకే పొజిషన్‌లో నిలబడ్డాయి. ఇరు జట్లూ మొదటి మ్యాచ్‌లో పాక్ చేతుల్లో ఓడడంతో సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఆదివారం జరిగే మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి..

ఇండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్ గ్రూప్ 2లో నాకౌట్‌ మ్యాచ్‌గా మారే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడితే మిగిలిన మూడు మ్యాచులు నామమాత్రమే అయిపోతాయి...

తాజాగా న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, టీమిండియాతో జరగబోయే మ్యాచ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ‘నేను పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను చూశాను...

Latest Videos


నాకు బౌలింగ్ ఏ ఓవర్‌లో వస్తుందో తెలీదు. అయితే నాకు బంతి అందించినప్పుడు షాహీన్ ఆఫ్రిదీలా టీమిండియా టాపార్డర్‌ను దెబ్బతీసి, వాళ్లను కష్టాల్లో పడేయాలని భావిస్తున్నా...

త్వరగా వికెట్లు పడిపోతే టీమిండియా ఒత్తిడిలో పడిపోతుంది. వేగంగా పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే ఆఫ్రిదీ ఏం చేసాడో, నేను దాన్నే ఫాలో అవ్వాలని అనుకుంటున్నా...

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాకు విజయం దక్కలేదు. అయితే చేసింది తక్కువ పరుగులే అయినా పాక్‌కి మంచి పోరాటం ఇవ్వగలిగాం... అందుకే టీమిండియాతో జరిగే మ్యాచ్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాం...

మార్టిన్ గుప్టిల్ వేగంగా కోలుకుంటున్నాడు. టీమిండియాతో జరిగే మ్యాచ్‌లో అతను ఆడే అవకాశం ఉంది. దుబాయ్ వాతావరణం, పిచ్ పరిస్థితులు ఛేదన చేస్తున్న జట్టుకే కలిసి వస్తున్నాయి...

కాబట్టి టాస్ కీలకంగా మారనుంది.  టీమిండియాలో వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. ఒకవేళ టాస్ ఓడిపోయినా టీమిండియా టాపార్డర్‌ను త్వరగా పెవిలియన్ చేరిస్తే, మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం దొరుకుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు ట్రెంట్ బౌల్ట్...

ట్రెంట్ బౌల్ట్ కామెంట్లపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చాడు. ‘ట్రెంట్ బౌల్ట్, షాహీన్ ఆఫ్రిదీని చూసి మోటివేట్ అయితే చాలా మంచిదే...

అయితే మేం అతన్ని కౌంటర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పాక్‌తో మేం రెండేళ్లుగా మ్యాచ్ ఆడింది లేదు, కానీ న్యూజిలాండ్‌తో అలా కాదు. వాళ్ల బౌలింగ్ అటాక్స్ గురించి మాకు పూర్తి అవగాహన ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్ల...

న్యూజిలాండ్‌తో చివరిసారిగా ఈ ఏడాది జూన్‌లో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడింది భారత జట్టు. ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది న్యూజిలాండ్...

గత 18 ఏళ్లుగా న్యూజిలాండ్‌పై ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు విజయాన్ని అందుకోలేకపోయింది. చివరిసారిగా 2003 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో న్యూజిలాండ్‌ను ఓడించిన టీమిండియా, ఆ తర్వాత 2007 టీ20 వరల్డ్‌కప్, 2016 టీ20 వరల్డ్‌కప్‌తో పాటు 2019 వరల్డ్‌కప్ సెమీస్‌లోనూ ఓడింది...

click me!