టీమిండియా గెలవాలనుకుంటే, వాళ్లిద్దరినీ ఆడించి తీరాలి... హర్భజన్ సింగ్ కామెంట్...

First Published Oct 26, 2021, 3:39 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన టీమిండియాకి, మొదటి మ్యాచ్‌లోనే పాకిస్తాన్ చేతుల్లో ఊహించని ఓటమి ఎదురైంది. దాయాది చేతుల్లో 10 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవి చూసింది భారత జట్టు...

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి వరల్డ్ క్లాస్ జట్లపై పది వికెట్లు తీసిన భారత బౌలర్లు, పాకిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో మాత్రం ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు...

ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ కలిసి చాలా ఈజీగా భారత బౌలర్లను ఎదుర్కొంటూ 17.5 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేసి, ఘనంగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీని ఆరంభించారు...

భారత జట్టు విజయంపై పూర్తి ధీమా వ్యక్తం చేసిన హర్భజన్ సింగ్, ఈ ఊహించని పరాభవంతో కాస్త నిరాశకు గురయ్యాడు. కారణం ఈ మ్యాచ్‌కి ముందు అక్తర్‌, భజ్జీ మధ్య జరిగిన మాటల యుద్ధమే...

‘మీరు ఆడితే ఎలాగో ఓడిపోతారు, మ్యాచ్ ఆడడం అవసరమా... వాకోవర్ ఇచ్చేయండి’ అంటూ షోయబ్ అక్తర్‌ను ఆటపట్టించాడు హర్భజన్ సింగ్. మ్యాచ్ రిజల్ట్ తేడా కొట్టడంతో భజ్జీని ట్రోల్ చేశాడు అక్తర్...

‘ఏం భజ్జీ... నీకు వాకోవర్ కావాలా? చూశావా మా వాళ్లు ఎలా ఆడారో... మీ బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు...’ అంటూ కామెంట్లు చేశాడు షోయబ్ అక్తర్...

‘ఇషాన్ కిషన్ చాలా టాలెంటెడ్ యంగ్ గన్. అతన్ని ఓపెనర్‌గా పంపించాలని నేను టీమిండియాకి సూచించా. కానీ వాళ్లు వినలేదు. రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా వచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేది...

కెఎల్ రాహుల్ నాలుగో స్థానంలో సరిగ్గా సరిపోతాడు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీని పంపి, సూర్యకుమార్ యాదవ్‌ లేదా హార్ధిక్ పాండ్యాలను ఆరో స్థానంలో ఆడిస్తే బాగుంటుంది...

శార్దూల్ ఠాకూర్ లాంటి ప్లేయర్‌‌ను జట్టులో పెట్టుకుని, ఎందుకు ఆడించలేదో అర్థం కావడం లేదు. ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్ జట్టులో ఉంటే, విజయం మనదే...

శార్దూల్ ఠాకూర్‌తో పాటు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తిలను ఆడిస్తే బాగుంటుంది. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఓడిపోయినా, అది టీమిండియాపై పెద్దగా ప్రభావం చూపించదు...

తొలి మ్యాచ్ ఓడిపోయినా, ఆ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో ఆడడం మనవాళ్లకు ఎప్పుడూ అలవాటే... అలాగే ఈసారి కూడా అదరగొడతారని ఆశిస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు హర్భజన్ సింగ్...

click me!