అతనితో మొదటి ఓవర్ వేయించి ఉంటే, సీన్ వేరేగా ఉండేది... జహీర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

First Published Oct 26, 2021, 3:00 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఎదురైన పరాభవం నుంచి ఇంకా టీమిండియా కోలుకోవడం లేదు. ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో పాక్ చేతుల్లో ఎదురైన పరాభవం కావడంతో ఆ ఇంపాక్ట్ తీవ్రంగా పడింది...

మొదటి మూడు ఓవర్లలో కేవలం 26 పరుగులే ఇచ్చినా, తన ఆఖరి ఓవర్‌లో నాలుగు బంతుల్లో 17 పరుగులు సమర్పించిన భారత పేసర్ మహ్మద్ షమీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. 

భారత్‌పై పాక్ విజయం తర్వాత చాలామంది ముస్లింలు, టపాకాయలు కాల్చి సెలబ్రేట్ చేసుకోవడం, జట్టులో ఉన్న ఏకైక ముస్లిమతస్తుడు మహ్మద్ షమీ కావడంతో ‘కావాలనే జట్టును ఓడించావ్..’ అంటూ అసభ్యపదజాలంతో దూషిసున్నారు. మహ్మద్ షమీకి మిగిలిన క్రికెటర్లు, భారత మాజీ క్రికెటర్ల నుంచి మద్ధతు లభిస్తోంది...

టీమిండియాకి ఎన్నో మ్యాచుల్లో విజయాలు అందించిన మహ్మద్ షమీని టార్గెట్ చేయడాన్ని తప్పుబడుతూ ‘We stand with Shami’ హ్యష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు...

అయితే షమీ మాత్రమే కాకుండా జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా కూడా వికెట్లు తీయలేకపోయిన విషయాన్ని జనాలు పెద్దగా గుర్తించడం లేదు. 

‘గేమ్‌కి ముందు ఎలా ఆడాలి? ఎవరితో బౌలింగ్ వేయించాలని చాలా ప్లాన్స్ వేసుకుని ఉంటారు. అయితే ఒక్కదాని క్రీజులోకి దిగిన తర్వాత వాటినే పర్ఫెక్ట్‌గా అమలు చేయాల్సిన అవసరం లేదు...

పరిస్థితులను బట్టి ప్రణాళికలు మార్చాల్సి ఉంటుంది. నా అంచనా ప్రకారం జస్ప్రిత్ బుమ్రాతో ఓపెనింగ్ ఓవర్ వేయించి ఉంటే, వికెట్ దక్కి ఉండేది...

కనీసం రెండో ఓవర్ అయినా బుమ్రాకి ఇవ్వాల్సింది. రెండు ఓవర్ల తర్వాత బుమ్రాని తేవడంతో ఇద్దరు ఓపెనర్లకి కుదురుకోవడానికి కావాల్సినంత సమయం దొరికింది...

అది కాకుండా వాళ్లకి పరిస్థితులు చక్కగా అనుకూలించాయి. సెకండ్ బ్యాటింగ్ చేయడం వల్ల పిచ్ మీద తేమ వారికి బ్యాటింగ్‌ని సులభతరం చేసేసింది... 

టీమిండియాకి పిచ్ నుంచి ఇలాంటి సహకారం దక్కలేదు. లేదంటే మనోళ్ల బ్యాటింగ్ మరోలా ఉండేది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్...

click me!