నాలుగున్నరేళ్ల తర్వాత ఆ ఇద్దరూ తొలిసారి... టీమిండియా లక్కీ హ్యాండ్స్ అశ్విన్, జడేజా కలిసి...

First Published Nov 3, 2021, 8:35 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ప్రకటించిన జట్టులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరు చూసి అందరూ అవాక్కయ్యారు. మిగిలిన ప్లేయర్ల ఎంపిక విషయంలో పెద్దగా ఆశ్చర్యాలు వ్యక్తంకాకున్నా, నాలుగున్నరేళ్ల తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు రవిచంద్రన్ అశ్విన్...

2017లో జూలై 9న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌, రవిచంద్రన్ అశ్విన్‌కి ఆఖరి టీ20 మ్యాచ్. 1578 రోజుల తర్వాత తిరిగి పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో 20 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. హర్భజన్ సింగ్ 16, ఇర్ఫాన్ పఠాన్ 16, నెహ్రా 15 వికెట్లు తీసి తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

తన ఆఖరి టీ20 తర్వాత 65 మ్యాచుల తర్వాత తిరిగి రీఎంట్రీ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్, సంజూ శాంసన్ తర్వాతి స్థానంలో నిలిచాడు...

భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్ 73 టీ20 మ్యాచుల తర్వాత శ్రీలంక టూర్‌లో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అశ్విన్‌తో పాటు ఉమేశ్ యాదవ్ కూడా 65 మ్యాచుల తర్వాత టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చారు...

అదీకాకుండా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ తర్వాత రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కలిసి ఆడడం ఇదే తొలిసారి...

2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్ కలిసి గత నెలలో జరిగిన టీ20 సిరీస్‌లో తొలిసారి కలిసి ఆడగా, అశ్విన్ జడేజా జోడి కలిసి టీ20 ఆడేందుకు నాలుగేళ్లు ఆగాల్సి వచ్చింది...

టీమిండియా తరుపున 111 వన్డే మ్యాచులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్, 150 వికెట్లు పడగొట్టాడు. 2017 జూన్‌లో చివరిసారిగా వన్డే మ్యాచ్ ఆడిన అశ్విన్, 10 ఓవర్లలో 3 వికెట్లు తీసి కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

ఆఫ్ఘాన్ మాజీ కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘాన్, గత మ్యాచ్‌ తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. అస్గర్ లేకుండా ఆఫ్ఘాన్ టీ20 మ్యాచ్ ఆడడం ఏడేళ్ల తర్వాత ఇదే తొలిసారి...

2014 మార్చిలో టీ20ల్లో ఆరంగ్రేటం చేసిన అస్గర్ ఆఫ్ఘాన్, అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ బరిలో దిగాడు...

2017లో రవిచంద్రన్ అశ్విన్ ఆడిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.  బ్యాటింగ్‌లో 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, బౌలింగ్‌లో 4 ఓవర్లలో 39 పరుగులు సమర్పించాడు. కుల్దీప్ ఒక్కడే క్రిస్ గేల్ వికెట్ తీయగలిగాడు...  

వరుసగా మూడో మ్యాచ్‌లోనూ టాస్ ఓడిన విరాట్ కోహ్లీ, వరుసగా ఆరు మ్యాచుల్లో టాస్ ఓడిన కెప్టెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ వరుసగా ఐదేసి మ్యాచుల్లో టాస్ ఓడగా, విరాట్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు...

అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్‌లో గత 20 మ్యాచుల్లో (టీ20, వన్డే, టెస్టులతో కలిపి) 17 సార్లు టాస్ ఓడిపోయి, పరమ చెత్త రికార్డు క్రియేట్ చేశాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ... 

click me!