అతని కంటే సూర్యకుమార్ యాదవ్ చాలా బెటర్... భారత మాజీ కెప్టెన్ ఆశీష్ నెహ్రా కామెంట్స్...

First Published Nov 3, 2021, 6:24 PM IST

టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీలో భారత జట్టు రెండు వరుస ఓటములను ఎదుర్కోవడంతో సలహాలు, సూచనలు ఇచ్చేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. తొలి మ్యాచ్‌లో గెలిచి ఉన్నా, ఇంత మంది నుంచి ఇన్ని రకాల సలహాలు వినాల్సిన అవసరం ఉండేది కాదేమో...

టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచుల్లో ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. ఐపీఎల్‌లో ఆడిన ఆఖరి రెండు మ్యాచుల్లోనూ 50+ స్కోర్లు చేశాడు... అందుకే మొదటి మ్యాచ్‌లో అతన్ని ఆడించకపోవడంపై విమర్శలు వచ్చాయి...

మంచి ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను పక్కనబెట్టి, పెద్దగా ఫామ్‌లో లేని సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించడంపై విమర్శలు వచ్చాయి. దాంతో రెండో మ్యాచ్‌లో మార్పులు జరిగాయి...

సూర్యకుమార్ యాదవ్ వెన్ను నొప్పితో బాధపడుతుండడంతో అతని స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చాడు. మొదటి ఓవర్‌లో నాలుగు బంతులు ఎదుర్కొన్న పరుగులేమీ చేయలేకపోయిన ఇషాన్ కిషన్, ఆ తర్వాతి ఓవర్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...

‘టీమిండియా సెలక్షన్ నా చేతుల్లో ఉంటే, నేను సూర్యకుమార్ యాదవ్‌ని కచ్ఛితంగా ఆడిస్తా. ఇషాన్ కిషన్ చాలా మంచి ప్లేయర్. అందులో ఎలాంటి సందేహం లేదు...

ఒక్క మ్యాచ్‌లో భారీ స్కోరు చేయనంత మాత్రాన అతన్ని తీసి పక్కనబెట్టడం కూడా కరెక్ట్ కాదు. కానీ సూర్యకుమార్ యాదవ్ ఆడితే, రోహిత్ శర్మ మళ్లీ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంటుంది...

ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఆడే విధానం జట్టుకి చాలా కీలకం. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ ఉండాలి. టీ20ల్లో టూ డౌన్ లేదా అంతకంటే కింది పొజిషన్‌లో కోహ్లీ ఆడడం కరెక్ట్ కాదు...

ఆఫ్ఘానిస్తాన్ వంటి జట్టుపై ఆడుతున్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఆఫ్ఘాన్‌లో మంచి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు... వారి ఎదుర్కోవడంలో సూర్యకి ఎలాంటి ఇబ్బంది ఉండదు...

ఇషాన్ కిషన్ సిక్సర్లతోనే ఆడాలని అనుకుంటాడు. అతన్ని క్రీజులో సహనంగా ఉండేలా చేయడం చాలా కష్టం. సూర్యకకుమార్ యాదవ్ సింగిల్స్ కూడా చాలా ఈజీగా తీయగలడు...

కాబట్టి సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌గా ఉంటే, ఇషాన్ కిషన్ కంటే అతన్ని ఆడించడమే చాలా మంచిది... ఆఫ్ఘాన్‌లో రషీద్ ఖాన్‌తో పాటు ముజీబ్ వుర్ రహ్మాన్ కూడా చాలా డేంజరస్‌గా కనిపిస్తున్నాడు...

నబీ కూడా చక్కగా బౌలింగ్ వేయగలడు. కాబట్టి ఆఫ్ఘాన్‌ స్పిన్నర్లను మన బ్యాట్స్‌మెన్ ఎలా ఎదుర్కొంటారనేది మ్యాచ్ రిజల్ట్‌ను డిసైడ్ చేస్తుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా...

click me!