స్కాట్లాండ్ తరుపున ఆడిన రాహుల్ ద్రావిడ్... ఒకటి రెండూ కాదు, ఏకంగా 11 మ్యాచులు ఆడి...

Published : Nov 03, 2021, 07:42 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో స్కాట్లాండ్ మంచి పర్ఫామెన్స్ చూపించింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా టోర్నీని ప్రారంభించిన స్కాట్లాండ్, క్వాలిఫైయర్స్‌లో బంగ్లాదేశ్‌ని ఓడించి అందరికీ షాక్ ఇచ్చింది...

PREV
114
స్కాట్లాండ్ తరుపున ఆడిన రాహుల్ ద్రావిడ్... ఒకటి రెండూ కాదు, ఏకంగా 11 మ్యాచులు ఆడి...

గ్రూప్ స్టేజ్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచిన స్కాట్లాండ్, మూడు మ్యాచుల్లో గెలిచి సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించింది. సూపర్ 12లో విజయాలు అందుకోకపోయిన, మంచి పోరాటప్రటిమ అయితే చూపించగలిగింది...

214

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 172 పరుగుల లక్ష్యఛేదనలో 156 పరుగులు చేసింది స్కాట్లాండ్. బౌలింగ్‌లో స్కాట్లాండ్ ఇచ్చిన 20 పరుగులు ఆ జట్టు ఓటమికి కారణమయ్యాయి. 

314

తాజాగా న్యూజిలాండ్‌, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ట్రెండింగ్‌లో కనిపించాడు...

414

స్కాట్లాండ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు రాహుల్ ద్రావిడ్ పేరు ట్రెండింగ్‌లో కనిపించడానికి ప్రధాన కారణం, భారత మాజీ క్రికెటర్, ఆ దేశం తరుపున 11 మ్యాచులు ఆడడమే...

514

2003 వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు అండర్‌డాగ్స్‌గా బరిలో దిగి ఫైనల్ చేరి, రన్నరప్‌గా నిలిచింది. ఆ మ్యాచ్ తర్వాత రాహుల్ ద్రావిడ్, స్కాట్లాండ్ జాతీయ జట్టు తరుపున 11 మ్యాచులు ఆడాడు...

614

1999 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో 8 మ్యాచులు ఆడి 65.86 సగటులో 461 పరుగులు చేసిన రాహుల్ ద్రావిడ్, 2003 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో 11 మ్యాచుల్లో 63.60 సగటుతో 318 పరుగులు చేశాడు. 

714

వన్డే వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత కొందరు భారత సీనియర్లు, అంతర్జాతీయ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. అలా దొరికిన బ్రేక్‌లో స్కాట్లాండ్ క్రికెట్ టీమ్‌ కోసం 11 మ్యాచులు ఆడాడు ద్రావిడ్...

814

స్కాట్లాండ్‌కి క్రికెట్‌కి ఆదరణ పెంచడంతో పాటు వారి క్రీడాభివృద్ధిలో భాగంగా భారత కోచ్ జాన్ రైట్, స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు సీఈవో గ్వేన్ జోన్స్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు...

914

స్కాట్లాండ్ నేషనల్ లీగ్‌లో 12 మ్యాచుల్లో 11 మ్యాచులు ఆడిన రాహుల్ ద్రావిడ్, 66.66 సగటుతో 600 పరుగులు చేసి అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు... ఇందులో 3 సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

1014

అయితే రాహుల్ ద్రావిడ్ తప్ప మిగిలిన ప్లేయర్లు ఎవ్వరూ రాణించకపోవడంతో ఈ టోర్నీలో 12 మ్యాచుల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలవగలిగింది స్కాట్లాండ్...

1114

1996, జూన్ 20న సౌరవ్ గంగూలీతో కలిసి అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రాహుల్ ద్రావిడ్, తన మొట్టమొదటి మ్యాచ్‌లో 95 పరుగులు చేశాడు. లార్డ్స్‌లో జరిగిన ఈ టెస్టులో గంగూలీ సెంచరీ చేసి అదరగొట్టాడు...

1214

2012, జనవరి 28న తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రాహుల్ ద్రావిడ్, తన కెరీర్‌లో టెస్టుల్లో 36 సెంచరీలు, వన్డేల్లో 12 సెంచరీలు చేశాడు...

1314

286 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 31,258 బంతులను ఎదుర్కొన్న రాహుల్ ద్రావిడ్, 2004లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో 12 గంటలకు పైగా క్రీజులో బ్యాటింగ్ చేసి రికార్డు క్రియేట్ చేశాడు...

1414

అండర్19 కోచ్‌గా భారత జట్టుకి స్టార్ క్రికెటర్లను అందించిన రాహుల్ ద్రావిడ్, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు... 

click me!

Recommended Stories