ఎమ్మెస్ ధోనీకి, విరాట్ కోహ్లీ ఉన్న తేడా ఇదే... ఈ రెండు కారణాలతోనే టీమిండియాకి...

First Published Nov 1, 2021, 6:40 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియా వరుసగా రెండు మ్యాచుల్లో ఓడడంతో మరోసారి భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి చర్చ వస్తోంది. మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ధోనీ లేని లోటు స్పష్టంగా తెలుస్తోందంటూ మాహీని గుర్తుకు చేసుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్...

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు రెండు వరల్డ్‌కప్స్, మూడు ఐసీసీ టైటిల్స్ గెలవడంతో మాహీని మెంటర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ... అయితే మెంటర్ మ్యాజిక్ ఏ మాత్రం వర్కవుట్ కాలేదు...

ఐసీసీ వరల్డ్‌కప్‌లో మొట్టమొదటిసారి పాకిస్తాన్ చేతుల్లో చిత్తుగా ఓడిన భారత జట్టు, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఓటమిపాలై, 18 ఏళ్లుగా ఐసీసీ టోర్నీల్లో ఆనవాయితీగా మారిన  కివీస్ చేతుల్లో పరాజయాన్ని కంటిన్యూ చేసింది...

ఈ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీనీ, మహేంద్ర సింగ్ ధోనీనీ పోలుస్తూ పోస్టులు, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ద్వైపాక్షిక సిరీస్ విజయాన్ని ‘కింగ్’ కోహ్లీ, కానీ ఐసీసీ టోర్నీల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్... 

నిజానికి టీమిండియాకి దొరికిన ఓ వజ్రాయుధంలాంటోడు మహేంద్ర సింగ్ ధోనీ.  టీమిండియాకి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్...

అయితే కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ అయిన ఎమ్మెస్ ధోనీ, చాలా మ్యాచుల్లో ప్లేయర్‌గా ఫెయిల్ అయ్యాడు. అయినా ఆ ప్రభావం టీమ్‌పై పెద్దగా పడేది కాదు...

ఎందుకంటే ఎమ్మెస్ ధోనీ లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చేవాడు. దాంతో అంతకుముందే గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, సురేష్ రైనా వంటి ప్లేయర్లు బ్యాటుతో రాణించేవాళ్లు...

దీంతో లోయర్ ఆర్డర్‌లో ధోనీ ఫెయిల్ అయినా ఆ ప్రభావం మిగిలినవారిపై పెద్దగా పడేది కాదు. అయితే విరాట్ కోహ్లీ పరిస్థితి అలా కాదు. విరాట్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్. అతను ఫెయిల్ అయితే మిగిలిన ప్లేయర్లు చాలా ఒత్తిడికి లోనవుతున్నారు...

2012 టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నుంచి ఇప్పటిదాకా గత నాలుగు టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత జట్టు తరుపున టాప్ స్కోరర్ విరాట్ కోహ్లీయే. 2012లొ కోహ్లీ 185 పరుగులు చేస్తే, 2014 టోర్నీలో 319 పరుగులు చేశాడు. ఈ రెండు టోర్నీల్లో టీమిండియా తరుపున టాప్ స్కోరర్ విరాట్ కోహ్లీయే...

2016 టీ20 వరల్డ్‌‌కప్ టోర్నీలో అయితే భారత జట్టు సెమీస్ చేరిందంటే విరాట్ కోహ్లీయే కారణం. ఆ టోర్నీలో విరాట్ కోహ్లీ 273 పరుగులు చేస్తే, మిగిలిన ప్లేయర్లు ఎవ్వరూ 100+ పరుగులు కూడా చేయలేకపోయారు. ఎమ్మెస్ ధోనీ 89, రోహిత్ 88 పరుగులు చేశారు...

ధోనీ కేవలం కెప్టెన్‌గా మాత్రమే ఆలోచించేవాడు, బ్యాట్స్‌మెన్‌గా అతని అవసరం ఎప్పుడోకానీ వచ్చేది కాదు. ఫీల్డ్ సెట్టింగ్‌పైన, బౌలింగ్ మార్పులపైనే పూర్తి ఫోకస్ పెట్టేవాడు...

విరాట్ కోహ్లీ అలా కాదు. కోహ్లీ భారత బ్యాటింగ్ ఆర్డర్‌కి వెన్నెముక. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 150+ స్కోరు చేయగలిగిన టీమిండియా, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 110 పరుగులే చేయగలిగింది. ఈ రెండు మ్యాచుల్లో ఉన్న తేడా కోహ్లీ ఇన్నింగ్స్...

అలాగే ఎమ్మెస్ ధోనీ బౌలర్లను శాసించేవాడు. అలాగే వికెట్లు తీయకపోయినా పూర్తిగా నమ్మకం ఉంచేవాడు.. ధోనీ కెప్టెన్సీలో జట్టులో సీనియర్లు, జూనియర్లు కలగలిసి ఉండేవాళ్లు. సచిన్, సెహ్వాగ్, యువరాజ్, గంభీర్... సీనియారిటీ తీసుకుని జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యత తీసుకుని ఆడేవాళ్లు.

ఇప్పుడు జట్టులో సీనియర్లు ఉన్నా, సీనియారిటీ తీసుకుని ఆడేవాళ్లు లేరు.. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు పేరుకి మాత్రమే సీనియర్లు. విరాట్ కోహ్లీ త్వరగా అవుటైనప్పుడు నిజంగా బాధ్యత తీసుకుని, వీళ్లు మ్యాచ్‌ని గెలిపించిన సంఘటనలు చాలా తక్కువే...

ఓ రకంగా చెప్పాలంటే విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్‌తో సమానం. సచిన్ టెండూల్కర్ వికెట్ తీస్తే చాలు, టీమిండియాని ఓడించవచ్చని ఫిక్స్ అయ్యేవి ప్రత్యర్థి జట్లు. కొన్నాళ్లకు సచిన్ అవుటైతే, టీమ్ ఓడినట్టే అని టీమ్‌మేట్స్ కూడా ఫిక్స్ అయిపోయారు...

అందుకే సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా సక్సెస్ కాలేకపోయాడు, విరాట్ కోహ్లీ పరిస్థితి కూడా అంతే. లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు, బుమ్రాని టార్గెట్ చేస్తే, జట్టు మొత్తం కలిసికట్టుగా వారిపై విరుచుకుపడింది. ఆ కసిని నింపడంలో విరాట్ కోహ్లీ సూపర్ సక్సెస్ అయ్యాడు...

అయితే ఐసీసీ టోర్నీల్లో ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగినప్పుడు 130 కోట్ల మంది భారతీయుల ఆశలను మోయాల్సి ఉంటుంది. అలాంటి సమయాల్లో కోహ్లీ ఒక్కడు ఏమీ చేయలేడు. మిగిలిన వాళ్లు ప్రెషర్‌ను దాటి, పర్ఫామ్ చేసేలా కూడా విరాట్ ప్రభావితం చేయలేకపోతున్నాడు...

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క వికెట్ తీయలేకపోయినా కోహ్లీ బౌలర్లను వెనకేసుకొచ్చాడు. అదే ఎమ్మెస్ ధోనీ అయితే బౌలింగ్ ఫెయిల్యూర్‌ని అంగీకరించేవాడు. సరిగా బౌలింగ్ చేయలేకపోయారని గట్టిగా చెప్పేవాడు. అలాంటి కామెంట్లు, బౌలర్లను ఓ రకమైన భయాన్ని క్రియేట్ చేసేవి....

వచ్చే మ్యాచ్‌లో సరిగా బౌలింగ్ చేయకపోతే... అనే ఆలోచనే వారిని మరింత రాటుతేలేలా చేసేది. అదీకాకుండా ఎమ్మెస్ ధోనీ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఆడే షాట్లను చూసి, గమనించి దానికి అనుగుణంగా పీల్డింగ్ సెట్ చేసేవాడు..

విరాట్ కోహ్లీ ఆ రకమైన స్ట్రాటెజీలు వేయడంలో విఫలమవుతున్నాడు. ఎందుకంటే అతను ఓ బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే ప్లేయర్లను చూస్తాడు. అన్నింటికీ మించి టాస్‌ల రూపంలో బ్యాడ్‌లక్ కూడా విరాట్‌ను వెంటాడుతూ ఉంది...

click me!