నీలాంటోడు, ఇలాంటి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు... విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై కపిల్‌దేవ్ రియాక్షన్...

First Published Nov 1, 2021, 5:57 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియా వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఓడింది. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు వరుసగా రెండు మ్యాచుల్లో ఓడడం ఇదే తొలిసారి. అది కూడా కనీస పోరాటం కూడా చూపించలేకపోతోంది టీమిండియా...

న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు, సంచలనం క్రియేట్ చేస్తున్నాయి. ‘టీమిండియా ఆడే ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటారు, మేం గెలుస్తామనే ఎన్నో ఆశలతో స్టేడియానికి వస్తారు...

130 కోట్ల మంది భారతీయుల ఆశలను మోస్తున్నామనే ఒత్తిడి మాపైన ఎప్పుడూ ఉంటుంది. దాన్ని ప్రతీ ఒక్కరూ స్వీకరించాల్సిందే.  అయితే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉండడంతో జట్టులో ధైర్యం లోపించింది...

మా బాడీ లాంగ్వేజీలోనే అది స్పష్టంగా కనిపించింది. అదే న్యూజిలాండ్ టీమ్ ఎంతో ఆత్మవిశ్వాసంగా కనిపించారు. అవకాశం క్రియేట్ చేసుకుని, మాపైన ఆధిపత్యం ప్రదర్శించారు...

మేం రెండు వికెట్లు పడిన తర్వాత షాట్స్ ఆడాలా? వద్దా? అనే ఆలోచనలో పడ్డాం. అది వారికి అడ్వాంటేజ్‌గా మారింది. బ్యాటుతోనే కాదు, బంతితోనూ పోరాడాల్సినంతగా పోరాడలేకపోయాం...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

‘విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు, ఇలాంటి కామెంట్లు చేయడం కరెక్టు కాదు. మాకు ధైర్యం సరిపోలేదని స్వయంగా కెప్టెన్ చెబితే, మేం సరిగా ఆడలేకపోయామని ప్లేయర్లు ఒప్పుకుంటే, ఆ జట్టుకి టైటిల్ గెలిచే అర్హత లేనట్టే...

ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగా ఉండడం, ఆత్మవిశ్వాసంతో మాట్లాడడమే కెప్టెన్ లక్షణం. విరాట్ కోహ్లీ కూడా చాలా ధైర్యవంతుడు. అతని నుంచి ఇలాంటి పిరికి మాటలు వస్తాయనుకోలేదు...

ఎన్నో విమర్శలు ఎదుర్కొని, కెప్టెన్‌గా వరల్డ్‌ క్లాస్ బ్యాట్స్‌మెన్‌గా ఎదిగాడు విరాట్ కోహ్లీ. అలాంటి వ్యక్తి, ఇలా మాట్లాడాడంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది... ఓ లీడర్ ఇలా మాట్లాడొచ్చా...

దేశం తరుపున ఆడే ప్రతీ ప్లేయర్‌కి పోరాడే తత్వం ఉంటుంది. ఓడినంత మాత్రాన ధైర్యం సరిపోలేదని చెబితే, అంతకంటే ఘోరం ఇంకేముంటుంది...

నాకు ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. ఐపీఎల్ ఆడి, టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు కావాల్సినంత ప్రాక్టీస్ సంపాదించిన జట్టు, ఇలా ఆడుతుందని నేను ఊహించలేదు...

టీమ్ చెత్తగా ఆడినప్పుడు విమర్శలు వస్తాయి. బాగా ఆడినప్పుడు వచ్చే పొడగ్తలు, ప్రశంసలు స్వీకరించినప్పుడు ఇలాంటి విమర్శలు కూడా తీసుకోవాలి... ఇలా దారుణంగా ఆడితే, తిట్లు తినడానికి కూడా సిద్ధంగా ఉండాలి.

అంతేకానీ ఆత్మస్థైర్యం కోల్పోయి, ధైర్యం సరిపోలేదని చెప్పడం కరెక్ట్ కాదు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూస్తే చాలా ముచ్ఛటేసింది. కానీ ఈ మ్యాచ్‌లో ఆ ఫైటింగ్ స్పిరిట్ కనిపించలేదు...

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఒక్కరూ కూడా సరిగా ఆడలేకపోయారనే బాధ అందరిదీ. టీమిండియా ఈ టోర్నీ గెలవకపోవచ్చు, ప్లేఆఫ్స్‌కి చేరకపోవచ్చు. అయితే కథ ఇక్కడితోనే అయిపోలేదు కదా... ’ అంటూ కామెంట్ చేశాడు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్...

click me!