మీరు ఎలా ఉంటే మాకెందుకు, సరిగా ఆడి చావండి... టీమిండియా పర్ఫామెన్స్ మాజీ కెప్టెన్ ఘాటు వ్యాఖ్యలు...

First Published Nov 3, 2021, 5:17 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021లో టీమిండియా పర్ఫామెన్స్, క్రికెట్ అభిమానుల్లో అనేక ప్రశ్నలను లేవనెత్తింది. తీరిక లేని క్రికెట్ కారణంగా అలిసిపోయాయంటూ జస్ప్రిత్ బుమ్రా చేసిన కామెంట్లు, బీసీసీఐ మరింత ఆగ్రహం పెరగడానికి కారణమయ్యాయి...

ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా టీమ్ సెలక్షన్ జరిగిందని, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, యజ్వేంద్ర చాహాల్ వంటి సీనియర్లను పక్కనబెట్టి ఏ మాత్రం అనుభవం లేని వరుణ్ చక్రవర్తి, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లను ఎంపిక చేయడంపై ట్రోల్స్ వస్తున్నాయి...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి జట్టుని ఎంపిక చేసినప్పుడు, అదిరిపోయిందని కామెంట్ చేసినవాళ్లే, మొదటి రెండు మ్యాచుల్లో టీమ్ పర్ఫామెన్స్ చూసిన తర్వాత తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు...

తాజాగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ అనంతరం జస్ప్రిత్ బుమ్రా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాడు మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్...

‘టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత జట్టు ప్రదర్శన చూస్తే, చాలా అలసిపోయినట్టు, ఇష్టం లేకుండా ఆడుతున్నట్టుగా అనిపించింది... నిజంగా బయో బబుల్‌ జీవితం ఇంత దుర్భలంగా ఉంటుందా?

అవేమీ మాకు తెలీదు. మీకు ఎలాంటి ఇబ్బందులైనా ఉండొచ్చు. కానీ ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్‌‌లోనే గెలవాలనే కసి కనిపించాలి. అది ఇప్పుడు టీమిండియాలో కనిపించడం లేదు...

బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో భారత జట్టు పర్ఫామెన్స్ మరీ పేలవంగా కనిపించింది. టీ20 ఫార్మాట్‌లో ప్లేయర్లు మొదటి బంతినుంచే పూర్తి ఎనర్జీతో ఆడాలి...

కుదురుకుని, మెల్లిగా తీరిగ్గా ఆడడానికి ఇది వన్డే ఫార్మాట్ కాదు, టెస్టు ఫార్మాట్ అంతకంటే కాదు. ఆలోచించేలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. భారత జట్టులో ఆ అలసత్వమే ఎక్కువగా కనిపించింది...

టీమిండియా ప్లేయర్లు ఎన్ని కష్టాలు పడుతున్నారు, వాళ్లు ఎంత క్రికెట్ ఆడుతున్నారు, ఎంత సంపాదిస్తున్నారనేది అభిమానులకు అవసరం. వరల్డ్‌కప్‌ ఆడుతున్నప్పుడు ఎలాగైనా గెలిచి తీరాలనే అనుకుంటారు...

సరిగా ఆడితేనే, ఆడగలిగితేనే టోర్నీకి వెళ్లాలి. లేదంటే ఎంతోమంది జట్టులో ప్లేస్ కోసం వెయిట్ చేస్తున్నారు. రవిచంద్రన్ అశ్విన్‌ని ఎందుకు ఆడించడం లేదు...

ఆడించనప్పుడు ఎందుకు జట్టులోకి ఎంపిక చేశారు. అతని పర్ఫామెన్స్‌పై ఏమైనా విచారణ జరిపిస్తున్నారా? అశ్విన్‌కి మూడు ఫార్మాట్లలో కలిపి 600+ వికెట్లు ఉన్నాయి...

జట్టులో అందరి కంటే సీనియర్ మోస్ట్ స్పిన్నర్. అలాంటి అతన్ని జట్టులో ఉంచుకుని, ఎందుకు ఆడించడం లేదో నాకైతే అర్థం కావడం లేదు... ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌లో కూడా అశ్విన్ ఆడలేదు...

అశ్విన్‌ని ఎందుకు దాచి పెడుతున్నారో ఆ మిస్టరీ ఏంటో నాకైతే అర్థం కాడం లేదు. ఫిట్‌గా లేని హార్ధిక్ పాండ్యాకి మాత్రం అవకాశాలు ఇస్తున్నారు... ఐపీఎల్‌లో ఎలా బాదాడో, అప్పుడే మరిచిపోయారా?’ అంటూ ప్రశ్నించాడు మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్...

click me!