ఆడించనప్పుడు అతన్ని ఎందుకు ఎంపిక చేశారు... సెలక్టర్ల తీరుపై హర్భజన్ సింగ్ అసంతృప్తి...

Published : Nov 08, 2021, 11:11 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో యజ్వేంద్ర చాహాల్ పేరు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా (టోర్నీ ఆరంభానికి ముందు వరకూ) ఉన్న చాహాల్‌ను ఎందుకు పక్కనబెట్టారనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు బీసీసీఐ...

PREV
110
ఆడించనప్పుడు అతన్ని ఎందుకు ఎంపిక చేశారు... సెలక్టర్ల తీరుపై హర్భజన్ సింగ్ అసంతృప్తి...

నాలుగేళ్లుగా భారత జట్టుకి టీ20ల్లో ప్రధాన బౌలర్‌గా ఉన్న యజ్వేంద్ర చాహాల్ నెమ్మదిగా బౌలింగ్ వేస్తున్నాడని, అతని కంటే వేగంగా బంతులు వేసే రాహుల్ చాహార్‌ని ఎంపిక చేసినట్టు సెలక్టర్లు వివరణ ఇచ్చారు...

210

‘టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి యజ్వేంద్ర చాహాల్‌కి కాదని రాహుల్ చాహార్‌ని ఎంపిక చేశారు. చాహాల్ కంటే చాహార్ వేగంగా బంతులు వేస్తాడని, అతని బౌలింగ్‌లో యూఏఈలో టీమిండియాకి ఉపయోగపడుతుందని అన్నారు...

310

అయితే ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో యజ్వేంద్ర చాహాల్ చాలా చక్కగా ఆడాడు. 15 మ్యాచుల్లో 18 వికెట్లు తీశాడు. ఇందులో యూఏఈ పిచ్‌లపైన మంచి ఎకానమీతో బంతులు వేయడమే కాకుండా కీలక సమయాల్లో వికెట్లు తీశాడు...

410

యూఏఈలో రాహుల్ చాహార్ ఫెయిల్ అయ్యాడు. రెండు మ్యాచులు ఆడినా వికెట్లేమీ తీయలేకపోయాడు. చాహాల్‌ని కాదని రాహుల్ చాహార్ని ఎంపిక చేసినప్పుడు, అతన్ని ఎందుకు ఆడించలేదు...

510

ఆఖరి మ్యాచ్ దాకా రాహుల్ చాహార్‌ని అట్టిపెట్టుకోవడానికి కారణమేంటి? ఆడించనప్పుడు అతన్ని ఎందుకు సెలక్ట్ చేశారు. ఒక్క మ్యాచ్ కోసమే చాహాల్‌ను పక్కనబెట్టి చాహార్‌ను సెలక్ట్ చేశారా...

610

యజ్వేంద్ర చాహాల్ కంటే రాహుల్ చాహార్ బెటర్ బౌలింగ్ అంటే నేను ఒప్పుకోను. చాహాల్ చాలా డేంజరస్ బౌలర్, తన బౌలింగ్‌లో టీమిండియాని ఎన్నో మ్యాచుల్లో గెలిపించాడు కూడా...

710

చాహార్‌ని కాదని రవిచంద్రన్ అశ్విన్‌కి అవకాశం ఇచ్చారు. అంటే చాహాల్ స్థానంలో ఎంపిక చేసిన చాహార్ వికెట్లు తీస్తాడనే నమ్మకం కూడా లేకపోయిందా... సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు...

810

2017లో రవిచంద్రన్ అశ్విన్‌ని టీ20, వన్డేల నుంచి తప్పించినప్పుడు, జట్టుకి మణికట్టు స్పిన్నర్లు కావాలని అన్నారు. చాహాల్, కుల్దీప్ యాదవ్‌లను జట్టులోకి తీసుకొచ్చారు...

910

వాళ్లు టీమిండియాకి మంచి విజయాలు కూడా అందించారు. ఇప్పుడు ఈ ఇద్దరినీ పక్కనబెట్టేసి మళ్లీ రవిచంద్రన్ అశ్విన్, జడేజాలే కావాలని అంటున్నారు. మీ ప్లానింగ్ ఏంటో అర్థం కావడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్...

1010

టీ20 వరల్డ్ కప్ టోర్నీ కెరీర్‌లో 25 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, ఓవరాల్‌గా అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. షకీబుల్ హసన్ 41, షాహీద్ ఆఫ్రిదీ 39, సయ్యిద్ అజ్మల్ 35, అజంతా మెండీస్ 35 వికెట్లు తీశారు. అయితే టాప్ 5లో ఉన్న వారిలో బెస్ట్ ఎకానమీ ఉన్న బౌలర్‌ నిలిచాడు అశ్విన్.

click me!

Recommended Stories