టీమిండియా తర్వాతి కెప్టెన్ అతనే... నమీబియాతో మ్యాచ్‌లో క్లారిటీ ఇచ్చేసిన విరాట్ కోహ్లీ...

First Published Nov 8, 2021, 7:46 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్‌గా వైదొలబోతున్నట్టు, ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ ఆరంభానికి ముందే ప్రకటించాడు విరాట్ కోహ్లీ... కోహ్లీ తప్పుకుంటే ఆ ప్లేస్‌ని భర్తీ చేసేది రోహిత్ శర్మేనంటూ అంచనా వేశారు క్రికెట్ ఫ్యాన్స్...

రోహిత్ శర్మకు ఐపీఎల్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. 9 సీజన్లలో కెప్టెన్‌గా ఐదు సార్లు టైటిల్స్ గెలిచి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఐపీఎల్ కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ...

విరాట్ కోహ్లీ గైర్హజరీలో ఆసియా కప్ 2018 టోర్నీకి కెప్టెన్‌గా వ్యవహరించి, టైటిల్ కూడా గెలిచాడు రోహిత్ శర్మ. అయితే 34 ఏళ్ల రోహిత్ శర్మకు టీ20 కెప్టెన్సీ ఇస్తే, మళ్లీ రెండు మూడేళ్లకే కొత్త కెప్టెన్‌ని వెతకాల్సి వస్తోందని బీసీసీఐ ఆలోచనలో పడిందని టాక్ వినిపించింది...

రోహిత్ శర్మ కంటే యంగ్ బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్‌కి టీ20 కెప్టెన్సీ ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కెఎల్ రాహుల్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ కూడా టీ20 కెప్టెన్సీ రేసులో ఉన్నారని అన్నారు...

అయితే కెప్టెన్‌గా ఆఖరి టీ20 మ్యాచ్ ఆడుతున్న సమయంలో టాస్ గెలిచిన అనంతరం ఈ వార్తలకుచెక్ పెట్టేశాడు విరాట్ కోహ్లీ... ‘టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు దక్కిన గౌరవం... కెప్టెన్‌గా నా బెస్ట్ ఇచ్చాను...

టెస్టులు, వన్డేలతో పోలిస్తే టీ20లు చాలా డిఫరెంట్. ఈ అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నా. జట్టు ఆడిన విధానానికి నేనెప్పుడూ గర్విస్తూనే ఉంటా.  రోహిత్ శర్మ చాలా అద్భుతమైన కెప్టెన్. టీమిండియా మంచివాళ్ల చేతుల్లోకే వెళ్లబోతోంది...

రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు అద్భుతాలు చేస్తుందని ఆశిస్తున్నా. అతని కెప్టెన్సీలో ఆడడానికి ఎదురుచూస్తున్నా... ’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

భారత హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు కూడా నమీబియాతో మ్యాచ్‌తో ముగియనుంది. దీంతో నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్ నుంచి కొత్త కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు మొదలుకానున్నాయి...

న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కి విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా వంటి స్టార్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వబోతున్నట్టు సమాచారం...

2018లో ఆసియా కప్ టైటిల్ గెలిచిన తర్వాత అవకాశం వస్తే, టీ20లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తానంటూ బహిరంగంగా మనసులో మాట బయటపెట్టాడు రోహిత్ శర్మ... 

అయితే విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ చేతుల్లో ఉంచుకోవడంతో రోహిత్ శర్మ కోరిక మూడున్నరేళ్ల తర్వాత తీరనుంది. సౌతాఫ్రికా టూర్‌లో టీ20 కెప్టెన్‌గా మొదటి సిరీస్ ఆడబోతున్నాడు రోహిత్ శర్మ... 

click me!