విరాట్, రోహిత్‌తో పాటు వాళ్లందరికీ రెస్ట్... న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి ఏకంగా ఏడుగురు ప్లేయర్లకు...

First Published Nov 8, 2021, 6:03 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు ఆశించిన స్థాయిలో పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచుల్లో కనీస పోరాటం కూడా చూపించకుండా ఓటమి పాలైంది. ఈ పర్పామెన్స్‌కి వాళ్లు చెప్పిన కారణం బిజీ షెడ్యూల్...

ఆరు నెలల క్రితం ఐపీఎల్ ఫస్టాఫ్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లిన భారత జట్టు, ఆ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్, యూఏఈలో ఐపీఎల్ సెకండ్ ఫేజ్, టీ20 వరల్డ్‌ కప్ 2021 అంటూ తీరిక లేని క్రికెట్ ఆడుతున్నారు...

సాధారణ పరిస్థితుల్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా అయితే ఇంత బిజీ షెడ్యూల్ పెద్ద కష్టమేమీ కాదు. అయితే కట్టుదిట్టమైన బయో బబుల్‌లో కట్టేసినట్టు ఉండే ఆంక్షల మధ్య బతుకుతూ ఇంత సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడడం కష్టంగానే ఉంటుంది...

న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఓటమి తర్వాత భారత సీనియర్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఈ విధంగానే కామెంట్స్ చేశాడు. ‘తీరక లేని క్రికెట్ కారణంగా అలసిపోయాం... మాకు తగినంత విశ్రాంతి దొరకడం లేదు...’ అంటూ బుమ్రా చేసిన కామెంట్లు బీసీసీఐపై విమర్శలు రావడానికి కారణమయ్యాయి...

భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా ఇదే విధమైన కామెంట్లు చేశాడు. ‘ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లకు వారం రోజుల విశ్రాంతి దొరికి ఉండాల్సింది. అప్పుడు రిజల్ట్ వేరేగా ఉండేది...’ అంటూ కామెంట్ చేశాడు భరత్ అరుణ్...

భారత క్రికెటర్ల నుంచి, అభిమానుల నుంచి బిజీ షెడ్యూల్‌పై విమర్శలు రావడంతో న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కి టీమిండియాలోని సీనియర్లకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది బీసీసీఐ...

నమీబియాతో మ్యాచ్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్‌లకు టీ20 సిరీస్‌కి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది బీసీసీఐ...

విరాట్ కోహ్లీతో పాటు మిగిలిన ఈ ప్లేయర్లు అందరూ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ నుంచి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్, ఐపీఎల్ 2021 సెకండాఫ్‌ అంటూ తీరిక లేని క్రికెట్ ఆడిన వారే... కాబట్టి వీరికి వారం రోజుల పాటు విశ్రాంతి ఇవ్వనుంది భారత క్రికెట్ బోర్డు...

నమీబియాతో మ్యాచ్ ముగిసిన తర్వాత నవంబర్ 9న స్వదేశానికి తిరిగి రానుంది భారత జట్టు. జూన్ 2న ఇంగ్లాండ్‌ టూర్ కోసం విమానం ఎక్కిన భారత క్రికెటర్లలో ఈ ఎనిమిది మంది, దాదాపు ఆరు నెలల తర్వాత స్వదేశానికి తిరిగి రాబోతున్నారు...

నవంబర్ 17న న్యూజిలాండ్‌తో మొదటి టీ20 ఆడనుంది భారత జట్టు. మొదటి మ్యాచ్ జైపూర్‌లో, రెండో టీ20 నవంబర్ 19న రాంఛీలో, మూడో టీ20 నవంబర్ 21న కోల్‌కత్తా ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతాయి...

నవంబర్ 9 నుంచి నవంబర్ 18 వరకూ కుటుంబంతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తారు భారత సీనియర్ క్రికెటర్లు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం మళ్లీ బయో బబుల్‌లో వచ్చి చేరతారు...

నవంబర్ 25న కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఆడే భారత జట్టు, ముంబైలోని వాంఖడే స్టేడియంలో డిసెంబర్ 3 నుంచి రెండో టెస్టు ఆడుతుంది... ఈ సిరీస్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా టూర్‌కి బయలుదేరి వెళ్తుంది భారత జట్టు...

సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో న్యూజిలాండ్‌తో సిరీస్‌కి సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ, భువనేశ్వర్ కుమార్, రవి భిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్, దేవ్‌దత్ పడిక్కల్, వెంకటేశ్ అయ్యర్ వంటి యువ క్రికెటర్లకు అవకాశం దక్కతుందని సమాచారం. 

click me!