భారత సారథి విరాట్ కోహ్లీకి ప్రత్యేకంగా శత్రువులు ఎవ్వరూ లేరు. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీని ఎప్పుడూ మెచ్చుకోనివారిలో భారీ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ముందుంటాడు. కోహ్లీకి కాకుండా రోహిత్ శర్మకు వన్డే, టీ20 కెప్టెన్సీ ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నాడు గంభీర్...
వాస్తవానికి 2009లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్‌తో కలిసి 224 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు విరాట్ కోహ్లీ. విరాట్ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ ఇన్నింగ్స్ ఇదే...
212
ఆ మ్యాచ్‌లో 111 బంతుల్లో 107 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మొట్టమొదటి వన్డే సెంచరీ బాదాడు. ఇదే మ్యాచ్‌లో 150 పరుగులు చేసిన గౌతమ్ గంభీర్‌ను ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుకి ఎంపిక చేశారు నిర్వాహకులు...
312
అయితే యంగ్ బ్యాట్స్‌మెన్ కోహ్లీకి ఈ అవార్డు దక్కితే ప్రోత్సాహకరంగా ఉంటుందని, తన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ను విరాట్‌కి అందించాడు గౌతమ్ గంభీర్... ఆనాడు గౌతీ చేసిన పనికి క్రికెట్ ప్రపంచం హర్షించింది...
412
అయితే ఆ సంఘటన జరిగిన నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్ 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ గొడవ పడడం సంచలనం క్రియేట్ చేసింది...
512
ఐపీఎల్ చరిత్రలోనే ఇదో వివాదాస్పద సంఘటన. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్ ప్రదీప్ సంగ్వాన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టడానికి ప్రయత్నించిన విరాట్ కోహ్లీ, 10వ ఓవర్‌లో అవుట్ అయ్యాడు...
612
పెవిలియన్‌కి వెళ్తున్న విరాట్ కోహ్లీ, బౌలర్‌ని ఏదో తిట్టడం... దాంతో గౌతమ్ గంభీర్, కోహ్లీని ఏదో మాట అనడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఇద్దరూ కొట్టుకోవడానికి ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు...
712
ఇద్దరూ ఢిల్లీకి చెందినవారే కావడంతో ఢిల్లీకి చెందిన మరో ప్లేయర్, కేకేఆర్ టీమ్‌మేట్ రజత్ భాటియా... ఈ ఇద్దరినీ నిలువరించి, గొడవ పెద్దది కాకుండా ఆపి, విరాట్‌ను పెవిలియన్‌కి పంపించాడు...
812
అయితే ఈ సంఘటనకి గౌతమ్ గంభీర్‌లో పెరిగిపోయిన అసహనమే కారణమంటారు చాలామంది. 2011 వన్డే వరల్డ్‌కప్ తర్వాత భారత జట్టులో రొటేషన్ పద్ధతి తీసుకొచ్చాడు ఎమ్మెస్ ధోనీ...
912
దీంతో అప్పటిదాకా వైస్ కెప్టెన్‌గా ఉన్న గౌతమ్ గంభీర్, వైస్ కెప్టెన్సీ కోల్పోవడమే కాకుండా జట్టులో చోటు కూడా కోల్పోయాడు. దీంతో ఎమ్మెస్ ధోనీతో దగ్గరగా మెలిగే విరాట్ కోహ్లీ అంటే గంభీర్‌కి పడేది కాదని క్రికెట్ విశ్లేషకులు చెబుతారు...
1012
ఇప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా 2011 వన్డే వరల్డ్‌కప్, 2007 టీ20 వరల్డ్‌కప్ విజయాల్లో ఎమ్మెస్ ధోనీ చేసిందేమీ లేదని, ఒక్క హెలికాఫ్టర్ షాట్‌తో వరల్డ్‌కప్‌లు వచ్చేయవని చెప్పే గౌతమ్ గంభీర్, కోహ్లీ అంటే కూడా ద్వేషం పెంచుకున్నాడని అంటారు...
1112
అయితే ఇద్దరూ ఢిల్లీకి చెందినవాళ్లే కాకుండా గౌతమ్ గంభీర్‌లాగే విరాట్ కోహ్లీ కూడా షార్ట్ టెంపర్ కావడం, ఎదుటివాళ్లపై నోరు పారేసుకునే రకం కావడంతో ఆనాడు అలా ప్రవర్తించి ఉంటారనేది మరో వాదన...
1212
విరాట్ కోహ్లీ కానీ, గౌతమ్ గంభీర్ కానీ ఆ రోజు ఏం జరిగిందో ఎప్పుడూ బయటపెట్టింది లేదు, కేవలం అలా ఫ్లోలో జరిగిపోయిందని తేల్చేశారు. అయితే ఆ గొడవనీ ఇద్దరూ మరిచిపోలేదని మాత్రం కోహ్లీపైన గంభీర్ చేసే కామెంట్లు చూస్తే తెలుస్తుంది.