ఎందుకు ఇలా జరిగిందో చెప్పలేను, షేన్ వార్న్ చెప్పిన ఆ మాటలే... రవిచంద్రన్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

First Published Nov 4, 2021, 8:10 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ వల్ల నాలుగున్నరేళ్ల తర్వాత రవిచంద్రన్ అశ్విన్‌కి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రీఎంట్రీ ఇవ్వడానికి అవకాశం దక్కింది. మొదటి రెండు మ్యాచుల్లో ఆడకపోయినా ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు అశ్విన్...

నాలుగు ఓవర్లలో 14 పరుగులు ఇచ్చిన 2 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో పూర్తి కోటా వేసి అతి తక్కువ పరుగులు సమర్పించిన ఐదో భారత బౌలర్‌గా నిలిచాడు...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో 22 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా తన రికార్డును మరింత మెరుగు పర్చుకున్నాడు అశ్విన్. హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ 16, రవీంద్ర జడేజా, ఆశీష్ నెహ్రా 15 వికెట్లతో టాప్ 5లో ఉన్నారు...

‘రీఎంట్రీకి ఎందుకింత సమయం పట్టిందంటే సమాధానం చెప్పలేను. నేను జీవితం గుండ్రంగా ఉందని నమ్ముతాను. కొందరికి అది చిన్నగా ఉంటుంది, మరికొందరికి పెద్దగా... 

ఏ ఫార్మాట్ అయినా పరిస్థితులను అర్థం చేసుకుని బౌలింగ్ చేయడం ఒక్కటే నేను ఇన్నేళ్లలో తెలుసుకున్నా. కొన్నేళ్లుగా బాగానే రాణిస్తున్నానని నమ్ముతున్నా... 

జీవితంలో ఒడిదుడుకులు అందరికీ సహజం. టీ20ల్లో రీఎంట్రీ ఇవ్వడానికి ఇన్నేళ్లు వేచి చూడాల్సి వచ్చిందని, ఎవరేమనుకుంటున్నారో పట్టించుకుంటూ కూర్చోలేను...

నా జీవితంలో సక్సెస్ వచ్చినప్పుడు కూడా దాన్ని ఎంతో వినయంగా స్వీకరించా. అంతేకానీ విజయగర్వంతో ఉప్పొంగిపోలేదు. నా జీవితంలో విజయాలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చినో, పరాజయాలను కూడా అంతే విలువిచ్చాను...

సక్సెస్ విషయంలో షేన్ వార్న్ చెప్పిన ఓ మాట నాకెంతో నచ్చింది. ఎవ్వరికైనా జీవితంలో 33 శాతం మాత్రం సక్సెస్ దక్కుతుంది. సచిన్ టెండూల్కర్ లాంటి లెజెండ్ కూడా తన కెరీర్‌లో కష్టకాలాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది...

కాబట్టి నేను కూడా అందుకు మినహాయింపు కాదు. అదే నేనూ నమ్ముతా. ఇక టీ20, వన్డేల్లో నాకు అవకాశం రాదని ఫిక్స్ అయిపోయి ఉంటే, ఐపీఎల్ కూడా ఆడకుండా ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉండేవాడిని...

తుదిజట్టు నుంచి చోటు కోల్పోయినంత మాత్రాన అతనిలో సత్తా లేదని కాదు. నిత్యం మెరుగుపర్చుకుంటూ, రాటుతేలుతుంటే అవకాశం అదే వెతుక్కుంటూ వస్తుంది...

2017 తర్వాత టెస్టుల్లో నేను బాగా రాణిస్తున్నా. కాబట్టి నేను ఎప్పుడూ క్రికెట్‌కి దూరమైంది లేదు. టీ20ల్లో నేను వేసే 24 బంతులను ఓ ఛాలెంజ్‌గా తీసుకుంటా. అందులో నాకు దక్కే విజయం ఎంతని లెక్కేసుకుంటా...’ అంటూ చెప్పుకొచ్చాడు రవిచంద్రన్ అశ్విన్...

టెస్టుల్లో 400+ వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లాండ్‌లో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...

డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత కౌంటీ మ్యాచ్‌లో ఆడి ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసినా, ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టు మ్యాచుల్లోనూ రవిచంద్రన్ అశ్విన్‌కి చోటు దక్కలేదు...

click me!