రాహుల్ ద్రావిడ్‌కి ఆ విషయం అస్సలు చెప్పకండి... బీసీసీఐకి అజయ్ జడేజా రిక్వెస్ట్...

First Published Nov 4, 2021, 6:20 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు బిజీగా ఉన్న సమయంలోనే టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ నియామకం జరిగిపోయింది. క్రికెటర్‌గా, అండర్-19 కోచ్‌గా, ఇండియా-ఏ టీమ్ కోచ్‌గా అపార అనుభవం కలిగిన ద్రావిడ్‌పై భారీ అంచనాలున్నాయి...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత రవిశాస్త్రి స్థానంలో భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపట్టబోతున్నాడు...

నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో స్వదేశంలో ఆరంభమయ్యే టీ20 సిరీస్, టీమిండియా పూర్తి స్థాయి కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌కి మొట్టమొదటి సిరీస్ కానుంది. తాత్కాలిక కోచ్‌గా శ్రీలంక టూర్‌లో బాధ్యతలు చేపట్టాడాడు రాహుల్ ద్రావిడ్...

‘టీమిండియాలో డెడికేషన్, క్రమశిక్షణ విషయంలో రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ ద్రావిడ్‌యే. ఓ జాతీయ జట్టుకి కోచ్‌గా ఉండే వ్యక్తికి ఎన్నో అర్హతలు ఉండాలి...

కానీ హెడ్‌కోచ్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణాలు ఈ రెండే. టీమిండియా టీ20 కెప్టెన్‌ను ఎవరు నియమిస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారా? లేక రాహుల్ ద్రావిడ్ కొత్త కెప్టెన్‌ని ఎంచుకుంటాడా? చూడాలి...

టీమిండియా కోచ్‌గా అయ్యే ప్రతీ వ్యక్తికి జట్టు ఇలా ఉండాలి, అలా ఆడాలి, వారిలా తయారవ్వాలి? అని చెబుతుంటారు బీసీసీఐ అధికారులు. కానీ రాహుల్ ద్రావిడ్‌కి మాత్రం ఆ విషయం అస్సలు చెప్పకండి...

ఎందుకంటే భారత కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌ని నియమించినప్పుడు ఆయన పనిని ఆయనకే వదిలేయాలి. రాహుల్ ద్రావిడ్‌కి టీమిండియాని ఎలా మార్చాలో, ఎలాంటి మార్పులు చేయాలో, ఏ విధమైన రూల్స్ తీసుకురావాలో బాగా తెలుసు...

క్రికెట్ ప్రపంచంలో రాహుల్ ద్రావిడ్‌లాంటి గొప్ప పేరున్న వ్యక్తిని కోచ్‌గా తీసుకొచ్చారు. అది చాలా మంచి విషయం. కాబట్టి అతని నిర్ణయాలను, ఆలోచనలను గౌరవించి, ఆయనకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి...

జట్టును ఎలా నడిపించాలో ఆయనకి చెప్పి, ద్రావిడ్‌ని తక్కువ చేయకండి. యువకుల నుంచి బెస్ట్ అవుట్  పుట్ తీసుకురావడంతో రాహుల్ ద్రావిడ్ ది బెస్ట్. ఆ విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువైంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా...

‘అండర్-19 కోచ్‌గా, ఇండియా - ఏ జట్టు కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ ఏం చేశారో, ఏం సాధించారో అందరికీ తెలుసు. ఎంతో క్రికెట్ అనుభవం ఉన్న సీనియర్ క్రికెటర్‌లా కాకుండా, వారిలో ఒకరిలా కలిసిపోతాడు రాహుల్ ద్రావిడ్...

ఆ వయసులో ఉన్న కుర్రాళ్లు ఎలా ఆలోచిస్తారో రాహుల్ ద్రావిడ్‌ అలాగే ఆలోచించి, అర్థం చేసుకుంటాడు. అందుకే ఆయన నియామకం భారత జట్టు ప్రదర్శన మరింత మెరుగుపరుస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్...

click me!