టీ20 వరల్డ్‌కప్ 2021 జెర్సీ విషయంలో పాకిస్తాన్ పైత్యం... ‘ఇండియా’ అని రాసి ఉందని, ఆ ప్లేస్‌లో...

First Published Oct 9, 2021, 5:52 PM IST

ఏదైనా మెగా ఈవెంట్ జరిగినప్పుడు, ఆ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న దేశం పేరు ఉన్న జెర్సీలను ధరించడం ఆనవాయితీ. టోక్యో ఒలింపిక్ సమయంలోనూ భారత అథ్లెట్లు అందరూ ‘టోక్యో 2020’ అని రాసి ఉన్న జెర్సీలను ధరించారు...

షెడ్యూల్ ప్రకారం భారత్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీని, కరోనా కారణంగా యూఏఈ వేదికగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి బీసీసీఐ, ఐసీసీ...

అయితే టోర్నీ నిర్వహణ బాధ్యత మొత్తం బీసీసీఐదే. భారత క్రికెట్ బోర్డు పెద్దల పర్యవేక్షణలోనే టీ20 వరల్డ్‌కప్ మ్యాచులన్నీ నిర్వహించబడతాయి...

Latest Videos


అందుకే టీ20 వరల్డ్‌కప్ కోసం రూపొందించే జెర్సీలపై మెన్స్ టీ20 వరల్డ్‌కప్ లోగో కింద ‘ఇండియా 2021’ అని రాసి ఉండాలని ఆయా దేశాల క్రికెట్ బోర్డులను సూచించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)...

ఇప్పటికే నెదర్లాండ్ వంటి దేశాలు, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో పాల్గొనే జెర్సీలను ఆవిష్కరించాయి. వీటిపై ‘ఇండియా 2021’ అని రాసి ఉంది...

అయితే పాక్ మాత్రం ‘ఇండియా’ అని రాసి ఉన్న జెర్సీలను ధరించడానికి ఏ మాత్రం ఇష్టపడడం లేదు. అందుకే ‘ఇండియా’ స్థానంలో ‘యూఏఈ 2021’ అని రాసి ఉన్న జెర్సీలను రూపొందించింది బీసీసీఐ..

ఎన్నో ఏళ్లుగా భారత్, పాకిస్తాన్ మధ్య వైరం కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు ‘ఇండియా’ అని ఉన్న జెర్సీలను ధరించడానికి కూడా పాక్ క్రికెటర్లు అయిష్టం వ్యక్తం చేయడంతో ఈ విషయంలో మరోసారి వివాదం రేగే అవకాశం కనిపిస్తోంది...

ఇప్పటికే అక్టోబర్ 24న జరిగే భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయిపోయాయి... దాదాపు రెండేళ్ల తర్వాత దాయాదుల మధ్య మ్యాచ్ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇరుదేశాల ప్రజలు...

పాక్ జట్టు, భారత జట్టును ఈజీగా ఓడిస్తుందని పాక్ మాజీ క్రికెటర్లు కామెంట్లు చేస్తున్నారు. పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా కూడా భారత్‌ను ఓడిస్తే, బ్లాంక్ చెక్ ఇస్తానంటూ ఓ వ్యాపారవేత్త ఆఫర్ చేశాడంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే...

click me!