శ్రీకర్ భరత్ నువ్వు కాపువా? లేక కమ్మవా... సోషల్ మీడియాలో మరోసారి పేట్రేగిన కులపిచ్చి...

First Published Oct 9, 2021, 4:53 PM IST

ఏ దేశమేగినా, ఎందుకాలిడినా... కులపిచ్చి మాత్రం వదలకురా తమ్ముడా! ఆంధ్రా రాజకీయాల గురించి, తెలుగు జనాల మైండ్‌సెట్‌కి సరిగ్గా సూట్ అయ్యే పద్యం ఇదే... మొన్నామధ్య పీవీ సింధు కులం గురించి తెగ వెతికేసిన కులపిచ్చి రాయుళ్లు, ఇప్పుడు క్రికెటర్ కోన శ్రీకర్ భరత్‌పై పడుతున్నారు...

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్సర్ బాది, యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు తెలుగు క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ శ్రీకర్ భరత్...

శ్రీకర్ భరత్ సిక్సర్ కొట్టిన తర్వాత ఒక్కసారిగా షాకైనా, సంతోషంతో బీభత్సంగా సెలబ్రేట్ చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు...

ఎన్నో ఏళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తూ రిజర్వు వికెట్ కీపర్‌గా భారత జట్టుతో ట్రావెల్ చేస్తూ వస్తున్నాడు శ్రీకర్ భరత్. ఇంగ్లాండ్ టూర్‌కి ముందు కూడా భారత జట్టుతో కలిసి క్వారంటైన్ గడిపాడు భరత్...

తీరా జట్టు పయనమయ్యే సమయానికి వృద్ధిమాన్ సాహా కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంత శ్రీకర్ భరత్‌కి నిరాశతప్పలేదు. ఐపీఎల్ 2021 వేలంలో భరత్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ...
(Photo source- iplt20.com)

అయితే ఫస్టాఫ్‌లో శ్రీకర్ భరత్‌కి ఒక్క అవకాశం కూడా రాలేదు. యూఏఈలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 95 పరుగులు చేసి ఆకట్టుకున్న భరత్, సెకండాఫ్‌లో తుదిజట్టులోకి వచ్చాడు.

2021 సీజన్ ద్వారా ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన శ్రీకర్ భరత్, 7 మ్యాచుల్లో 45.50 సగటుతో 182 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు...

ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడిన ఇన్నింగ్స్ తర్వాత శ్రీకర్ భరత్ ఫాలోయింగ్, క్రేజ్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. ఎప్పటిలాగే కొందరు తెలుగు నెటిజన్లు, మనోడి కులం గురించి వాకబు చేయడం మొదలెట్టారు...

కొందరు శ్రీకర్ భరత్‌ది కమ్మ కులం అంటే, మరికొందరు కాపు కులం అంటూ సోషల్ మీడియాలో కులపిచ్చి పట్టిన కుక్కల్లా కొట్టుకుంటున్నారు...

ఈ కాస్ట్ డిస్కర్షన్ అంతా జరిగింది శ్రీకర్ భరత్ చేసిన ట్విట్టర్ పోస్టు కిందే కావడం మరో విశేషం. భారత జట్టులో తెలుగు ప్లేయర్లకు సరైన అవకాశాలు దక్కలేదని బాధపడేవాళ్లు, ఈ డిస్కర్షన్ చూసి మనవాళ్లు టీమిండియాకి ఆడకపోవడమే మంచిదని అనుకుంటున్నారు...

21వ శతాబ్దంలో టెక్నాలజీ హంగులతో యావత్ ప్రపంచం, మార్స్‌పైన ఇళ్లు కట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే... మనోళ్లు మాత్రం ‘మావోడు... మా కులం వాడు...’ అనే కులపిచ్చి నుంచి భయపడలేకపోతున్నారు...

click me!