ఆరెంజ్ ఆర్మీ వీడియోలో కనిపించని డేవిడ్ వార్నర్... ఏం చేశాడని ఇంతలా అవమానిస్తున్నారంటూ?...

Published : Oct 09, 2021, 04:14 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌కి ఏ మాత్రం కలిసి రాలేదు. జట్టు పర్ఫామెన్స్ కంటే ఎక్కువగా డేవిడ్ వార్నర్‌కి జరిగిన పరాభవం, ఆరెంజ్ ఆర్మీ అభిమానులను మరింతగా బాధపెట్టింది...

PREV
19
ఆరెంజ్ ఆర్మీ వీడియోలో కనిపించని డేవిడ్ వార్నర్... ఏం చేశాడని ఇంతలా అవమానిస్తున్నారంటూ?...

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును సొంత టీమ్ కంటే ఎక్కువగా అభిమానించే డేవిడ్ వార్నర్‌ను సీజన్ మధ్యలో కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది టీమ్ మేనేజ్‌మెంట్...
(photo Source- Getty)

29

ఆ తర్వాత అతనికి తుదిజట్టులో కూడా చోటు దక్కలేదు. ఫేజ్ 2లో రెండు మ్యాచుల్లో ఆడిన డేవిడ్ వార్నర్, ఆ తర్వాత కొన్ని మ్యాచుల్లో స్టేడియంలో కూడా కనిపించలేదు...

39

హోటల్ నుంచి స్టేడియానికి వచ్చి, జట్టును ఉత్సాపరిచేందుకు కూడా డేవిడ్ వార్నర్‌ను అనుమతించలేదని తెలిసింది... దీంతో టీమ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు రావడంతో ఆఖరి రెండు మ్యాచుల సమయంలో స్టేడియంలో కనిపించాడు వార్నర్...

49

తాజాగా ఐపీఎల్ 2021 సీజన్‌ను ఆఖరి స్థానంతో ముగించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆరెంజ్ ఆర్మీకి థ్యాంక్యూ చెబుతూ ఓ ఫేర్‌వెర్ వీడియోను రూపొందించింది...

59

ఈ వీడియోలో కెప్టెన్ కేన్ విలియంసన్‌ నుంచి అందుబాటులో ఉన్న ప్లేయర్లు అందరూ కనిపించి, ఆరెంజ్ ఆర్మీ సపోర్ట్‌కి కృతజ్ఞతలు తెలిపారు...

69

అయితే ఈ వీడియోలో డేవిడ్ వార్నర్ కనిపించలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏ వీడియో పోస్టు చేసినా, ఏ ఫోటో పెట్టినా... దానికి స్పందించే వార్నర్ భాయ్, ఈ వీడియోకి కూడా స్పందించాడు...

79

చాలామంది అభిమానులు, ఈ వీడియోలో డేవిడ్ వార్నర్ ఎందుకు లేడంటూ ప్రశ్నించారు. వారికి సమాధానం ఇచ్చిన వార్నర్... ‘ఇలా వీడియో చేయమని నన్ను ఎవ్వరూ అడగలేదు...’ అంటూ రిప్లై ఇచ్చాడు...

89

సన్‌రైజర్స్ హైదరాబాద్ కోసం ఎంతో చేసిన ఓ లెజెండరీ క్రికెటర్‌ని ఇంతలా అవమానించడం, టీమ్ మేనేజ్‌మెంట్‌కి ఏ మాత్రం భావ్యం కాదని అంటూ, ఆరెంజ్ ఆర్మీని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు అభిమానులు...

99

కేదార్ జాదవ్, ధోనీ వంటి ప్లేయర్లు గత సీజన్‌లో ఎంత ఘోరంగా ఫెయిల్ అయినా చెన్నై సూపర్ కింగ్స్ వారిని ఎక్కడా, ఏ విధంగానూ అవమానించలేదని, ఒక్క సీజన్‌లో పర్ఫామెన్స్ లేదని ఇలా చేస్తారా? ఓ ఆటగాడిని ఎలా గౌరవించాలో సీఎస్‌కేని చూసి నేర్చుకోవాలంటూ తిట్టిపోస్తున్నారు వార్నర్ భాయ్ ఫ్యాన్స్... 

click me!

Recommended Stories