అది ఎప్పుడో మరిచిపోయాం, ఐపీఎల్ వల్లే ఇక్కడిదాకా... కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్ వ్యాఖ్యలు...

First Published Nov 10, 2021, 7:55 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు వరుసగా రెండు మ్యాచులు ఓడిన తర్వాత మొదట ట్రోల్స్ వచ్చింది ఐపీఎల్‌పైనే. ఐపీఎల్ కారణంగానే భారత జట్టు ప్రదర్శన ఇలా తయారయ్యిందని, టీమిండియాకి ఆడడం కంటే ఫ్రాంఛైజీలకు ఆడడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ తీవ్రంగా ట్రోల్స్ వచ్చాయి. 

ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ ముగిసిన తర్వాత వెంటనే టీ20 వరల్డ్‌కప్ టోర్నీ మొదలుకావడంతో తీవ్రంగా అలసిపోయామని భారత బృందం నుంచి కూడా వ్యాఖ్యలు వినిపించాయి..

అయితే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ మాత్రం తమకు ఐపీఎల్ వల్ల చాలా మేలు జరిగిందని, వాస్తవానికి సెకండ్ ఫేజ్ కారణంగానే ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించామని కామెంట్ చేశాడు...

‘టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ముందు ఐపీఎల్ ఆడడం చాలా మంచిదైంది. వరల్డ్ క్లాస్ ప్లేయర్లతో క్రికెట్ ఆడడం వల్ల వారి బలాలను, మన బలహీనతలను తెలుసుకునేందుకు అవకాశం దొరికింది...

అంతేకాకుండా ఐపీఎల్ వంటి ఎంతో విలువైన అనుభవాలను పంచుకునే అవకాశం దొరికింది. అది ఈ టోర్నీలో మాకు బాగా ఉపయోగపడింది...

సెకండ్ ఫేజ్‌ ఐపీఎల్ మ్యాచులు ఆడడం వల్ల ఇక్కడి పిచ్‌లు ఎలా స్పందిస్తాయనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. అప్పుడు ఫెయిల్ అవ్వడం వల్ల సక్సెస్ కావడానికి ఏం చేయాలో తెలుసుకోవడానికి ఐపీఎల్ ఉపయోగపడింది...

ఐపీఎల్‌తో పోలిస్తే ఇప్పుడు మ్యాచులు పూర్తి భిన్నంగా జరుగుతున్నాయి. చాలా స్వల్ప స్కోర్లు నమోదవుతున్నాయి. ఏ జట్టు అయినా తమదైనా ఎంత బలమైన టీమ్‌నైనా మట్టికరిపించగలదు...

అందుకే టీ20 ఫార్మాట్‌లో ఫేవరెట్స్ అనే మాటకి తావులేదు. ఇప్పటిదాకా మేం ఆడిన విధానం మాకు సంతృప్తినిచ్చింది. దాన్ని ఇలాగే కొనసాగించాలని అనుకుంటున్నాం...

2019 వన్డే వరల్డ్‌కప్ ఓటమిని ఎప్పుడో మరిచిపోయాం. అదో అద్భుతమైన మ్యాచ్, మేం విజయం కోసం నూటికి 200 శాతం ప్రయత్నించాం. కానీ మాకు అదృష్టం కలిసి రాలేదు...

జెంటిల్మెన్ గేమ్‌లో ప్రతీకారం అనే మాటకు తావులేదు. అందుకే ఇంగ్లాండ్‌పైన ప్రతీకారం తీర్చుకోవాలని కాకుండా, విజయం కోసం నూటికి నూరు శాతం ఇవ్వాలనే ఉద్దేశంతో సెమీస్‌కి సిద్ధమవుతున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్...

కేన్ విలియంసన్ కెప్టెన్సీలో 2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఫైనల్ చేరి, రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్, గత జూన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టును ఓడించి, 21 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్‌ను గెలిచింది. 

ఐపీఎల్ 2021 సీజన్‌ ఫస్టాఫ్‌లో ఆరు మ్యాచులు ముగిసిన తర్వాత డేవిడ్ వార్నర్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్నాడు కేన్ విలియంసన్. అయితే కేన్ మామ కెప్టెన్సీలోనూ సన్‌రైజర్స్ విజయాలు అందుకోలేకపోయింది...

డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఆరు మ్యాచుల్లో ఒకే ఒక్క విజయం అందుకుంటే, కేన్ విలియంసన్ కెప్టెన్సీలో 7 మ్యాచులు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు విజయాలు మాత్రమే అందుకోగలిగింది... 

click me!