ఐపీఎల్ ఆడితేనే, టీమ్‌కి సెలక్ట్ చేస్తారా... ఆ ఇద్దరూ ఇంకేం చేయాలి... హర్భజన్ సింగ్ కామెంట్స్...

First Published Nov 10, 2021, 6:42 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నవాళ్లందరూ ఐపీఎల్ స్టార్లే... ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అదరగొడితే వారిని ఏరి కోరి టీమిండియాలోకి ఎంపిక చేస్తున్నారు సెలక్టర్లు. తాజాగా న్యూజిలాండ్ సిరీస్‌లో ఎంపికైన జట్టు పరిస్థితి కూడా ఇంతే...

ఐపీఎల్ 2021 సీజన్‌లో అద్భుతంగా రాణించిన రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్‌లకు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కింది...

న్యూజిలాండ్‌తో సిరీస్‌తో పాటు సౌతాఫ్రికాలో పర్యటించే ఇండియా ఏ జట్టును కూడా ప్రకటించింది బీసీసీఐ. ప్రియాంక్ పంచల్ కెప్టెన్‌గా వ్యవహరించే 14 మందితో కూడిన భారత్ ఏ జట్టు... సౌతాఫ్రికా టూర్‌లో నాలుగు రోజుల పాటు సాగే మూడు టెస్టు మ్యాచులు ఆడనుంది...

w

ముంబై ఇండియన్స్ ఓపెనర్ పృథ్వీషాతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్, ముంబై ఇండియన్స్ బౌలర్ రాహుల్ చాహార్‌లకు ఈ జట్టులో చోటు దక్కింది...

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌తో పాటు కృష్ణప్ప గౌతమ్, నవ్‌దీప్ సైనీ, అభిమన్యు ఈశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్, బాబా అపరాజిత్, ఉపేంద్ర యాదవ్, సౌరబ్ కుమార్, ఇషాన్ పోరెల్, అర్జన్ నాగ్వాస్‌వాలాలకు ఈ టూర్‌కి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కింది...

‘రంజీ సీజన్ 2018-19లో 854 పరుగులు, 2019-2020 సీజన్‌లో 809 పరుగులు, రంజీ ఛాంపియన్, ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అయినా ఇండియా ఏ టీమ్‌కి అతను సెలక్ట్ కాలేదు...

సెలక్టర్లు దయచేసి,  ఇండియా తరుపున పరుగులు చేయడంతో పాటు ఇంకేం చేయాలో అతనికి చెప్పండి... సిగ్గు చేటు... ’ అంటూ షెల్డన్ జాక్సన్ గురించి పోస్టు చేశాడు హర్భజన్ సింగ్...

షెల్డన్ జాక్సన్‌తో పాటు మన్‌దీప్ సింగ్ గురించి కూడా పోస్టు చేశాడు హర్భజన్. ‘ఇంకో టాప్ ప్లేయర్, టీమిండియా తరుపున కాదు కదా, ఇండియా ఏ తరుపున కూడా ఆడడానికి తగడా? సెలక్టర్లు జట్టును ఎంపిక చేసే ముందు కొన్ని దేశవాళీ మ్యాచుల రికార్డులను కూడా చూడాలి...

అలా కాకపోతే రంజీ సీజన్‌ని నిర్వహించడం వల్ల లాభం ఏంటి? గత ఏడాది కరోనా కారణంగా సీజన్ కూడా జరగలేదు... షాకింగ్’ అంటూ ట్వీట్ చేశాడు హర్భజన్ సింగ్...

మన్‌దీప్ సింగ్, 2019-20 రంజీ ట్రోఫీ సీజన్‌లో 6 మ్యాచులు ఆడి ఓ డబుల్ సెంచరీతో 555 పరుగులు చేశాడు. సగటు 138.75గా ఉంది. అయినా అతనికి ఇండియా ఏ జట్టులోనూ చోటు దక్కలేదు...

రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నవారిని కూడా పట్టించుకోకుండా కేవలం ఐపీఎల్‌తో పాటు మిగిలిన అంశాల ఆధారంగా జట్టుకు ప్లేయర్లను ఎంపిక చేస్తున్నట్టుగా ఉందని సెలక్టర్లను విమర్శించాడు హర్భజన్ సింగ్...

click me!