రోహిత్ శర్మ కాదు, అతనికే టీమిండియా టీ20 కెప్టెన్సీ... ఏ మాత్రం కెప్టెన్సీ స్కిల్స్‌ లేని వ్యక్తికి...

First Published Nov 5, 2021, 6:32 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీతో భారత క్రికెట్‌లో ఓ శకం ముగియనుంది. విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు, 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఆరంభానికి ముందే ప్రకటించాడు. దీంతో తర్వాతి కెప్టెన్ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది భారత జట్టు. నవంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే ఈ టీ20 సిరీస్ నుంచి భారత హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు రాహుల్ ద్రావిడ్...

కోచ్‌గా రవిశాస్త్రి, టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ శకం ముగియడంతో నవంబర్ 17 నుంచి కోచ్ రాహుల్ ద్రావిడ్ సారథ్యంలో జట్టును నడిపించే కొత్త కెప్టెన్ ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది...

ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు టీ20 కెప్టెన్సీ దక్కుతుందని, అతనికి కెప్టెన్సీ ఇవ్వడమే న్యాయమని భావించారు టీమిండియా ఫ్యాన్స్...

అయితే రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌తో పాటు అతని వయసు కూడా టీ20 కెప్టెన్సీ చేపట్టడానికి ‘హిట్‌మ్యాన్’కి అడ్డంకిగా మారాయి. దీంతో బీసీసీఐ, రోహిత్ శర్మకు బదులుగా కెఎల్ రాహుల్‌కి టీ20 కెప్టెన్సీ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం...

టీ20 వరల్డ్‌కప్ అనంతరం న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్లకు విశ్రాంతి ఇవ్వాలని ఆలోచిస్తోంది బీసీసీఐ... ఇదే జరిగితే కెఎల్ రాహుల్, టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు...

వాస్తవానికి కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ స్కిల్స్ ఏ మాత్రం లేవని క్రికెట్ విశ్లేషకులు తేల్చేశారు. ఐపీఎల్ 2020, 2021 సీజన్లలో పంజాబ్ కింగ్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు కెఎల్ రాహుల్...

గత రెండు సీజన్లలోనూ కెఎల్ రాహుల్ 600+ పరుగులు చేసి, ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు. అయితే జట్టును విజయపథంలో నడిపించడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు...

గత రెండు సీజన్లలోనూ ఆరో స్థానంలో నిలిచింది పంజాబ్ కింగ్స్. కెఎల్ రాహుల్ కంటే మయాంక్ అగర్వాల్‌ జట్టును బాగా నడిపించగలిగాడు. దీంతో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో జట్టు ఎలా ఆడుతుందోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్...

రోహిత్ శర్మ కాకపోతే శ్రేయాస్ అయ్యర్ లేదా రిషబ్ పంత్‌లకు టీ20 కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు అభిమానులు. ఈ ఇద్దరిలో ఉన్న నాయకత్వ లక్షణాలు, జట్టుకి బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

click me!