హార్ధిక్ పాండ్యాకి మెంటర్ ఎమ్మెస్ ధోనీ సపోర్ట్... పాండ్యా స్థానంలో అయ్యర్‌ను ఆడించాలనుకున్న సెలక్టర్లు...

First Published | Oct 29, 2021, 5:30 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి మెంటర్‌గా ఎంపికైన మహేంద్ర సింగ్ ధోనీ, టీమ్ సెలక్షన్ నుంచి బ్యాటింగ్ ఆర్డర్ దాకా అన్నీ స్వయంగా తానే డిసైడ్ చేస్తున్నాడు. కెప్టెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించినా, అన్‌అఫిషియన్ ఆఫ్ గ్రౌండ్‌ కెప్టెన్‌గా మారాడు ధోనీ...

బౌలింగ్ వేసేందుకు ఫిట్‌గా లేని హార్ధిక్ పాండ్యాని టీ20 వరల్డ్‌కప్ 2021 జట్టుకి ఎంపిక చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి...

పాండ్యా ఆల్‌రౌండర్‌గా జట్టులో ఉంటే ఓకే కానీ కేవలం బ్యాటింగ్‌లో మెరుపుల కోసం అతన్ని ఆడించడం అనవసరమని ట్రోలింగ్ వచ్చింది...


అయితే హార్ధిక్ పాండ్యా సెలక్షన్ వెనక మెంటర్ మహేంద్ర సింగ్ ధోనీ హస్తం ఉందట. మహేంద్ర సింగ్ ధోనీకి కొందరు ఫెవరెట్ ప్లేయర్లు ఉంటారు. వాళ్లు ఫామ్‌లో ఉన్నా, లేకపోయినా పరుగులు చేసినా చేయకపోయినా జట్టులో వారికి చోటు ఉంటుంది...

సురేష్ రైనా ఆ విధంగానే చాలాకాలం టీమిండియాలో కొనసాగాడు. ఫామ్‌లో ఉన్న యూసఫ్ పఠాన్‌కి అవకాశం ఇవ్వకుండా ఫామ్‌లో లేకపోయినా రైనాని ధోనీ ఆడించాడని యువరాజ్ సింగ్ చేసిన కామెంట్లు అప్పట్లో సంచలనం క్రియేట్ చేశాయి...

ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్ 2021 జట్టు ఎంపిక విషయంలోనూ అలాంటి నిర్ణయమే తీసుకున్నాడట ఎమ్మెస్ ధోనీ... ‘ఐపీఎల్‌లో బౌలింగ్ చేయలేకపోయిన తర్వాత బసీసీఐ సెలక్టర్లు, హార్ధిక్ పాండ్యాని స్వదేశానికి పంపాలని అనుకున్నారు...

బౌలింగ్ చేయలేకపోతే హార్ధిక్ పాండ్యా టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఉండడం అవసరమని సెలక్టర్లు భావించారు. హార్ధిక్ పాండ్యా స్థానంలో యంగ్ సెన్సేషన్ వెంకటేశ్ అయ్యర్‌కి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందని బీసీసీఐ ఆలోచించారు..

అయితే మెంటర్ ఎమ్మెస్ ధోనీ మాత్రం హార్ధిక్ పాండ్యా ఉండాల్సిందేనని పట్టుబట్టాడు. గత ఆరు నెలలుగా హార్ధిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై అనుమానాలు ఉన్నా, ధోనీ మాత్రం పాండ్యా కావాలని కోరాడు...

ఫిట్‌నెస్ సరిగా లేని క్రికెటర్‌ని వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో ఆడించడం కరెక్ట్ కాదని బీసీసీఐ సెలక్టర్లు, ఎమ్మెస్ ధోనీతో వాదించాడు. అయితే మాహీ మాత్రం పాండ్యాపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశాడు...

దీంతో చేసేదేం లేక హార్ధిక్ పాండ్యా సెలక్షన్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిలకే తుది నిర్ణయం వదిలేశారు. వరల్డ్‌కప్‌కి ఫిట్‌నెస్ టెస్టులో పాల్గొని పూర్తి ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే జట్టులో చోటు ఇవ్వాలని సూచించారు...

అయితే కోహ్లీ, రవిశాస్త్రి కూడా మహేంద్ర సింగ్ ధోనీ చెప్పిన మాటలకు తల ఊపారు. అందుకే ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేయకపోయినా పాండ్యాకి టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కింది...’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ మాజీ సెలక్టర్ సందీప్ పాటిల్...

Latest Videos

click me!