ఇలా అయితే ఆ జట్లకి స్టార్ క్రికెటర్లు ఎలా దొరుకుతారు... ఐపీఎల్ 2022 రిటెన్షన్ పాలసీపై ఆకాశ్ చోప్రా...

First Published Oct 29, 2021, 3:45 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండు కొత్త జట్ల ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. డిసెంబర్ లేదా జనవరి నెలలో మెగా వేలం నిర్వహించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది బీసీసీఐ. అయితే ఐపీఎల్ 2022 రిటెన్షన్ పాలసీ రూల్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు భారత మాజీ క్రికెటర్, క్రికెట్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...

ఐపీఎల్ 2022 సీజన్‌లో అహ్మదాబాద్, లక్నో సిటీల పేరుతో రెండు కొత్త జట్లు రాబోతున్నాయి. లక్నో జట్టును సంజీవ్ గోయింకా గ్రూప్ రూ.7090 కోట్లకు కొనుగోలు చేయగా, అహ్మదాబాద్‌ జట్టును సీవీసీ క్యాపిటల్స్ జట్టు రూ.5166 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే...

ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు పాత జట్లకి నలుగురు ప్లేయర్లను అట్టి పెట్టుకునేందుకు అవకాశం కల్పించింది ఐపీఎల్ మేనేజ్‌మెంట్...

Latest Videos


8 ఫ్రాంఛైజీలు తమ జట్టులో ఉన్న ముగ్గురు స్వదేశీ ప్లేయర్లను, ఓ విదేశీ ప్లేయర్లను లేదా ఇద్దరు స్వదేశీ, ఇద్దరు విదేశీ ప్లేయర్లను అట్టిపెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది...

కొత్త జట్లకు కూడా మెగా వేలానికి ముందు ముగ్గురు ప్లేయర్లను ఫ్రీ టికెట్ ద్వారా కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించనుంది. ఇద్దరు స్వదేశీ, ఓ విదేశీ ప్లేయర్‌ను మెగా వేలానికి ముందు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది బీసీసీఐ...

‘నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం అంటే పాత ఫ్రాంఛైజీలకు లక్కీ ఛాన్స్ ఇచ్చినట్టే. యావరేజ్‌గా పాత 8 జట్లూ ముగ్గురు ప్లేయర్లను రిటైన్ చేసుకున్నా 24 మంది ప్లేయర్లు అవుతారు..

ఈ 24లో 20 మంది స్వదేశీ క్రికెటర్లు కచ్ఛితంగా ఉంటారు. 20 మంది స్టార్లను పాత ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకుంటే, కొత్త జట్లకు స్టార్ ప్లేయర్లు ఎక్కడి నుంచి దొరుకుతారు...

ప్రస్తుతం భారత జట్టులో సభ్యులుగా ఉన్నవాళ్లు, వరల్డ్‌కప్ ఆడుతున్నవారితో పోలిస్తే మొత్తంగా 20 నుంచి 22 మంది ప్లేయర్లు మాత్రమే ఉంటారు. వారిని వదిలేసుకోవడానికి ఏ జట్టూ ఇష్టపడకపోవచ్చు...

స్వదేశీ స్టార్లు అందుబాటులో లేనప్పుడు కొత్త జట్లు, విదేశీ స్టార్ల గురించే ఆలోచిస్తాయి. ఎందుకంటే మహా అయితే ఇద్దరు విదేశీ స్టార్లను మాత్రమే అట్టిపెట్టుకునే అవకాశం ఉండడంతో వేలంలో చాలామంది ఫారిన్ స్టార్ క్రికెటర్లు ఉంటారు...

అదే జరిగితే తుదిజట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లను కాకుండా ఐదుగురిని ఆడించేందుకు అనుమతి ఇవ్వాలని కొత్త ఫ్రాంఛైజీలు కోరే అవకాశం ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు ఆకాశ్ చోప్రా...

ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్‌లో సంజూ శాంసన్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌లో భువనేశ్వర్ కుమార్, నటరాజన్ తప్ప చెప్పుకోదగ్గ స్వదేశీ స్టార్లు లేరు. కొత్త జట్ల ఎంట్రీతో స్వదేశీ స్టార్ల కొరత తీవ్రం కానుంది.

click me!